మిగిలిన క్రీడల సంగతి ఎలా ఉన్నా.. మన దేశంలో క్రికెట్ ఒక మతం లాంటిది. అంతలా అభిమానిస్తారు. ఆరాధిస్తారు. అంతే ఆవేశంగా రియాక్టు అవుతారు. మన దేశంలో క్రికెట్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రపంచంలోని చాలా దేశాల్లో ఫుట్ బాల్ ను అంతకు మించి అన్నట్లుగా ఆరాధిస్తుంటారు. తాము అభిమానించే క్రీడలో ఓటమి ఎదురైతే అభిమానులు ఎంతలా రియాక్టు అవుతారో తెలిసిందే.
ప్రస్తుతం ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ జరుగుతోంది. పెద్ద ఎత్తున భావోద్వేగాలకు నిలయంగా మారిన ఈ టోర్నీలో తాజాగా మొరాకో జట్టు చేతిలో బెల్జియం ఓడిపోయింది. ఈ సంచలన విజయంతో మొరాకో జట్టు ఇప్పుడు పండుగ చేసుకుంటుంది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బెల్జియం జట్టు రెండో స్థానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొరాకో జట్టుతో జరిగిన మ్యాచ్ లో తమ జట్టు 2-0 తేడాతో ఓడిపోవటాన్ని బెల్జియం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బెల్జియం రాజధానిలో భారీ ఎత్తున విధ్వంసకాండ జరుగుతోంది. ఆ దేశ రాజధాని బ్రసెల్స్ లో ఓటమి తాలుకూ ఉద్రికత్త ఎక్కువగా నిలుస్తోంది.
తాము అభిమానించే జట్టు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేని బెల్జియం వాసులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టటమే కాదు.. రోడ్ల మీద కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.
మొరాకో జట్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు.. అల్లర్లను క్రియేట్ చేశారు. కొందరు ఆవేశంతో కర్రలు పట్టుకొని వాహనాలపై దాడి చేయటంతో పరిస్థితులు చేజారిన పరిస్థితి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించటంతో పాటు ఇప్పటివరకు పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకరిని అరెస్టు చేశారని.. అల్లర్లకు.. విధ్వంసాలకు పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు.
ఈ హింసా కాండకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిమానాన్ని గుండెల్లో దాచుకోవటంఓకే. కానీ.. ఇలారోడ్ల మీదకు వచ్చేసి విధ్వంసకాండను చేపడితేనే సమస్య. తాజాగా చోటు చేసుకున్న అల్లర్లలో పలువురికి గాయాలు కావటంతో పాటు.. పలు వాహనాలు ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.