బ్రెజిల్ దేశాధ్యక్షుడి యవ్వారం ఇప్పుడా దేశంలో హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా దేశాధ్యక్షుడే అధికార నివాసంలో దెయ్యాలు ఉన్నట్లుగా చెప్పటం సంచలం సృష్టిస్తోంది. అంతేనా.. దెయ్యాల దెబ్బకు తనకు మానసిక ప్రశాంతత ఉండటం లేదని.. నిద్రసరిగా పట్టటం లేదంటూ విలాసవంతమైన అధికార అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసేసిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమెర్ కు చాలా చిత్రమైన సమస్య ఎదురైంది. దేశాధ్యక్షుడికి కేటాయించిన అధికార నివాసంలో చిత్రవిచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నది ఆయన వాదన.రాత్రిళ్లు వంటింట్లో వస్తువులు కదలటం.. వింత వింత శబ్దాలు వినిపిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. అధ్యక్ష భవనంలో అసాధారణమైన వేవో ఉన్నట్లుగా తనకు అనిపిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఇంట్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి తాను హ్యాపీగా లేనట్లు మీడియాకు చెప్పేశారు. బ్రెజిల్ రాజధాని బ్రెజిలియా నడిబొడ్డున ఉండే అధ్యక్షుల వారి భవనం ‘‘అల్వొర్డా ప్యాలెస్’’ లో సకల సదుపాయాలు ఉండటమే కాదు.. అత్యంత విలాసవంతంగా ఉంటుందని చెబుతారు. పెద్ద స్విమ్మింగ్ ఫూల్.. ఫుట్ బాల్ గ్రౌండ్.. మెడికల్ షాపు.. చర్చి లాంటివి కూడా ఉన్నాయి.
అధ్యక్ష ఎన్నికలు ముగిసినతర్వాత భార్యతో కలిసి అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టిన టెమర్ తొలిరోజు నుంచీ పెద్దఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్యాలస్ లోవాస్తు సమస్యలు ఉన్నట్లుగా భావించి పూజలు కూడాచేయించారు.అయినా ఫలితం లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధ్యక్షభవనాన్ని ఖాళీ చేసి.. ఉపాధ్యక్షుల వారికి కేటాయించే ఇంటికి మారిపోయారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం దెయ్యాల కొంపా?అంటూ విస్మయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/