పులివెందులలో ఇళ్ల పట్టాల పంచి తీరుతామన్న సీఎం జగన్

Update: 2020-12-25 10:14 GMT
ఏపీ లో ఇళ్ల స్థలాల పంపిణి కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కాబోతున్నది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. కడపలోని పులివెందులలో ఈరోజు జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రికి బయలుదేరారు.

ఇదిలా ఉంటే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుండగా, సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో పట్టాల పంపిణీ కి బ్రేక్ పడింది. పులివెందులలో ఇళ్ల పట్టాలు పంపిణీ పై హైకోర్టుకు వెళ్లి ఓ వ్యక్తి స్టే తీసుకు వచ్చిన క్రమంలో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగడం లేదు. నేడు వైకుంఠ ఏకాదశి, అలాగే క్రిస్మస్ పర్వదినం కావడంతో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ముందు క్రిస్మస్ సందర్భంగా కడపలోని పులివెందులలో సీఎం జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

పులివెందులలోని సీఎస్ఐ చర్చి లో సీఎం జగన్ తో పాటు సీఎం సతీమణి వైయస్ భారతి, వైయస్ విజయమ్మ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, కాకుంటే ఈరోజు పులివెందులలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేకపోవడం బాధాకరమని, పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఎవరో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని, 10శాతం కుట్రలు, కుయుక్తులు వల్ల ఇళ్ల పట్టాల పంపిణి ఆలస్యం అవుతుందని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే పులివెందులలో ఇళ్లపట్టాలు పంచుతామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Tags:    

Similar News