ఐపీఎల్​ ముందు రోహిత్​కు బ్రేక్​..!

Update: 2021-03-02 07:30 GMT
కరోనా దెబ్బతో కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్​ టోర్నీలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వతా ఐపీఎల్​తో మళ్లీ క్రికెట్​ స్టార్ట్​ అయ్యింది. అప్పటినుంచి భారత క్రికెటర్లు నిరంతరాయంగా ఆడుతూనే ఉన్నారు. కరోనా టైంలోనూ బయో బబుల్​ లో ఉంటూ ఆడారు. కరోనా ఎఫెక్ట్​తో గత ఐపీఎల్​ 2020 సీజన్​ దుబాయ్​లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తర్వతా మళ్లీ ఆస్ట్రేలియా టూర్​ కు వెళ్లారు. అది ముగిసిన వెంబడే ఇంగ్లాండ్​ తో ఆడుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు కొందరు క్రికెటర్లకు రెస్ట్​ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నదట.

జస్‌ప్రీత్ బుమ్రా ప్రస్తుతం రెస్ట్​ తీసుకుంటున్నాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్​కు అతడు దూరమయ్యాడు.  ఇంగ్లండ్‌ తో మార్చి 23, 26, 28 వ తేదీల్లో మూడు వన్డేల సీరిస్‌కు జరుగనున్నది. ఈ సీరిస్​కు  టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్‌ల తో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లకు రెస్ట్​ ఇవ్వనున్నట్టు సమాచారం.

 టీ20 సీరిస్‌కు కొత్తగా సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తిలకు అవకాశం కల్పించింది. రోహిత్​ శర్మ త్వరలో ఐపీఎల్​లో ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి కొంతకాలం రెస్ట్​ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నదట. వరుస టోర్నీలతో  ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో రోహిత్​ శర్మను ఆస్ట్రేలియా టూర్​కు ఎంపిక చేయకపోవడంతో రకరకలా రూమర్స్​ వచ్చాయి. ఎట్టకేలకు అతడిని మళ్లీ ఆస్ట్రేలియా టూర్​కు ఎంపికచేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లాండ్​ వన్డేసీరిస్​కు రోహిత్​ను దూరం పెడితే ఎటువంటి విమర్శలు వస్తాయో వేచి చూడాలి.
Tags:    

Similar News