బ్రేకింగ్: అఖిలప్రియకు బెయిల్ మంజూరు

Update: 2021-01-22 13:31 GMT
సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఇరుక్కొని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన  టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైల్లో ఉంటున్న ఆమెకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది.

అఖిలప్రియకు తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్టు వెల్లడించింది.మరోవైపు ఆమె భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.

అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు పిటీషన్ పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో అతడి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు విచారణలో అనుమానాలు తలెత్తడంతో  ముందస్తుగా బెయిల్ కోసం ఆయన పిటీషన్ వేసినట్టు తెలిసింది.

హఫీజ్ పేటలోని ఓ భూవివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావు అనే ముగ్గురు సోదరులను అఖిలప్రియ ఆధ్వర్యంలో కిడ్నాప్ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.అఖిలప్రియ అరెస్ట్ కాగా.. ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్ రామ్ లను నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అఖిలప్రియను అరెస్ట్ చేయగా.. తాజాగా బెయిల్ లభించింది.
Tags:    

Similar News