కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పకడ్బందీగా అమలువుతోంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో దేశమంతా ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమై ఉండాలని ప్రధానమంత్రి సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పదేపదే కోరుతున్నారు. నిత్యవసరాలు, అత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అయినా వినకుండా కొందరు ఏ పనీ లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. అయితే పోలీసులు అవనసరంగా రోడ్ల మీదకు వచ్చేవారి తాట తీస్తున్నారు. వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా ఫైన్‌లు వేస్తున్నారు.
ఈ తరుణంలో అత్యవసర సేవలు కావాల్సిన వారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వైద్యం, ప్రభుత్వ సిబ్బంది, నిత్యావసరాలను సరఫరా చేసే వాహనదారులు, స్వచ్ఛంద సంస్థల వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక పాసులు మంజూరు చేస్తామని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. వైద్యం చేయించుకోవడం కోసం, స్వచ్ఛంద సేవ చేసేవాళ్లు, ప్రభుత్వ విధులు నిర్వర్తించే వాళ్లు, ఇతరత్రా సమస్యలతో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారికి కరోనా ఎమర్జెన్సీ పాసులను జారీ చేసేందుకు సిద్ధమైంది.
వెహికిల్ పాస్ ల మంజూరు కోసం 13 జిల్లాల పోలీస్ శాఖ వాట్సప్ నెంబర్లు, ఈ మెయిల్ వివరాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితిలో పాస్ కావాల్సిన వారు ఆధార్ కార్డు, పూర్తి వివరాలతో పాటు తమ సమస్యలను ఆయా జిల్లా పోలీస్ అధికారులకు వివరిస్తే వెంటనే పాస్ మంజూరు చేస్తారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత సంబంధిత వ్యక్తికి మొబైల్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ఐడీకి పాస్‌ను పంపిస్తారు. ఐతే జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ నుంచి వచ్చిన పాస్ లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్ చేసిన పాస్ లు చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. అలాగే , ప్రయాణించేటప్పుడు తమ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని పోలీస్ శాఖ తెలిపింది. అయితే , దీన్ని అదునుగా తీసుకోని పాస్ లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.