తెలంగాణ లో గత కొన్ని రోజులుగా నమోదు అయ్యే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది అని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండబోతుంది. ఈ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, కంపెనీలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను రాత్రి 8 గంటల వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. రాత్రి 9 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు కానుంది. కేవలం అత్యవసర విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డులను ఉంచుకోవాలి. ఇక ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికుల వద్ద వ్యాలిడ్ టికెట్లు ఉంటే వారికి నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తారు. అంతర్ రాష్ర్ట సర్వీసులు, రాష్ర్ట సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇక కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్, విద్యుత్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇక కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్, విద్యుత్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం తెలియజేసింది.