జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడ్డారు. వారితోపాటు పవన్ భద్రతా సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో.. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లోకి వెళ్లారు పవన్. డాక్టర్ల సూచనతో ఈ మేరకు పవన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్ నుంచే రోజూవారీ పార్టీ విధులను, కార్యక్రమాలను పవన్ పరిశీలిస్తారని తెలిపింది. పార్టీ సమావేశాలను కూడా ఐసోలేషన్ నుంచి కొనసాగిస్తారని, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో పవన్ సమావేశాలు నిర్వహిస్తారని వెల్లడించింది.
కాగా.. పవన్ క్వారంటైన్లోకి వెళ్లడంతో షూటింగ్ లు అర్ధంతరంగా నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తోపాటు హరిహర వీరమల్లు చిత్రంలో పారలాల్ గా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం ఒక సెట్లో, సాయంత్రం మరో సెట్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అలాంటిది.. పవన్ ఐసోలేషన్లోకి వెళ్లడంతో అన్ని కార్యక్రమాలకూ బ్రేక్ పడే పరిస్థితి వచ్చింది.