ఎన్నికలకు కేసీఆర్ సై.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం..

Update: 2022-08-08 07:24 GMT
తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల్లోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్ కార్యాలయం ప్రకటించింది.

రాజీనామా అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. తన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారని అన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించానని అన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కొనేందుకే కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలను వాయిదా వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ సర్కార్ ఇంత స్పీడుగా ఆమోదిస్తారని ఎవ్వరూ ఊహించలేదు.

మునుగోడులో బీజేపీతో తేల్చుకునేందుకే కేసీఆర్ ఇంత వేగంగా రాజీనామాను ఆమోదింపచేశారని తెలుస్తోంది. స్పీకర్ కు ఇలా అందగానే అలా రాజీనామా ఆమోదించడం వెనుక టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల వార్ ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలలలోపు మునుగోడు ఉపఎన్నిక రావడం ఖాయమని తెలుస్తోంది.

స్పీకర్ తన రాజీనామా ఆమోదించకపోతే ఆమోదం తెలిపే వరకూ పోరాటం చేస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేడని.. తన రాజీనామా జాప్యం చేస్తారని వార్తలు రాగా.. రాజగోపాల్ రెడ్డి పోరుబాటుకు రెడీ అయ్యారు.

అయితే ఊహించని విధంగా కేసీఆర్ సర్కార్ రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చే నిమిషాల్లోనే ఆమోదం తెలుపడం విశేషం. దీంతో పార్టీ వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది.

2018 డిసెంబర్ లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లో అసమ్మతివాదిగా ఉంటూ ఎట్టకేలకు బీజేపీలో చేరారు.
Tags:    

Similar News