నెల క్రితం వరకూ ‘‘బ్రెగ్జిట్’’ అన్న పదం సగటు జీవికి పెద్దగా పరిచయం కూడా లేదు. ఇప్పుడది తన జీవితాన్ని ఎంతగా ప్రభావం చూపుతుందన్న భయంతో వణికిపోయే పరిస్థితి. మనకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెల్లోడికి(బ్రిటీషోడు) తన దేశంలో అమలవుతున్న విధానం ఒకటి నచ్చకపోవటం ఏమిటి? దాని మీద ఓటింగ్ జరగనుండటం ఏమిటి?వారు వేసే ఓటు ప్రపంచాన్ని ప్రభావితం చేయటం ఏమిటి? మామూలుగా చూస్తే.. ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నా.. అంతర్లీనంగా బలమైన బంధం ఉండటమే కాదు.. ప్రపంచాన్ని అగ్రరాజ్యాలు ఎలా ప్రభావితం చేస్తాయన్నది అర్థం కావటానికి బ్రెగ్జిట్ కు మించింది మరొకటి ఉండదనే చెప్పాలి. తెల్లోడు ప్రపంచాన్ని ఎందుకు వణికిస్తున్నాడు? వాడికి వచ్చిన కష్టం ఏమిటి? వాడికి కలుగుతున్న నష్టం ఏమిటి? వారి ఆందోళన ప్రపంచానికి వణుకు తెప్పించటం ఏమిటన్నది సిం‘ఫుల్’గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే..
అసలీ బ్రెగ్జిట్ ఏమిటి?
బ్రిటన్ ఎగ్జిట్ అనే పదాలకు సంక్షిప్త రూపమే బ్రెగ్జిట్. దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం యూరప్ లోని 27దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ గా మారి స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే విధానికి తెర తీశాయి. ఉదాహరణకు స్వీడన్ లో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే.. యూరోపియన్ యూనియన్ లోని 27 దేశాలకు తన వస్తువుల్ని ఈజీగా అమ్ముకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకించి మిగిలిన దేశాల్లో అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. ఇలాంటి వెసులుబాట్లు ఎన్నో ఉన్నాయి. అయితే.. అలా ఉంటూ ఎవరి వ్యాపారాలువారు చేసుకుంటున్న వేళ.. బ్రిటీష్ పౌరులకు ఒక డౌట్ వచ్చింది. తాము యూరోపియన్ యూనియన్ లో అనవసరంగా ఉంటున్నామని.. తాము కానీ.. ఆ యూనియన్ నుంచి బయటకు వచ్చేసి తమ వ్యాపారం తాము చేసుకుంటే తాముమరింత బాగుపడతామన్న భావన మొదలైంది. అది అంతకంతకు పెరిగి.. యూరోపియన్ యూనియన్ నుంచి ఉండటమా? వైదొలగటమా? అన్నరెండు ప్రశ్నలకు వద్ద ఆగింది. ఈ యవ్వారం తేల్చేందుకు 4.6 కోట్ల మంది ప్రజలు ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
వాళ్ల గొడవతో మనకేంటి సంబంధం?
నిజమే.. తెల్లోళ్లు కొంతమంద మధ్య నడుస్తున్న పంచాయితీతో మనకు సంబంధం ఏమిటని అనుకుంటాం. కానీ.. లెక్క చాలానే ఉంది. ఈ కూటమి నుంచి బ్రిటన్ కానీ బయటకు రావాలన్నది ఆ దేశ ప్రజానీకం తీర్పు ఇచ్చిందో మహా ప్రళయం లాంటిదే ప్రపంచాన్ని ముంచుకొస్తుంది. అదెలా అన్న డౌట్ వస్తుంది. దానికి ఇంకో సింఫుల్ ఉదాహరణ చెబితే ఇట్టే అర్థమవుతుంది. మన అందరికి తెలిసిన టాటా సంస్థ తెలుసు కదా. ఈ సంస్థకు భారత్ లో ఉన్న బేస్ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకు చెందిన టాటా మోటార్స్ కు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీతో లింకు ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావటం ఖాయమైన పక్షంలో ఈ కంపెనీకి కలిగే నష్టం అక్షరాల రూ.10వేల కోట్లు. రానున్న నాలుగేళ్లలో ఈ కంపెనీకి నష్టం అంటే.. ఆ మేరకు ఈ కంపెనీలో షేర్లు ఉన్న మదుపరులకు భారీ నష్టమే అన్న మాట. ఈ ప్రభావం టాటా షేర్ల మీద పడితే.. అది చక్రంలా తిరుగుతూ తనకు సంబంధం ఉన్న అన్ని రంగాల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది శాంపిల్ గా చెప్పిన ఉదాహరణే.
ఇదొక్కటే కాదు.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగటం ఖాయమైతే ఆ దేశ కరెన్సీ పౌండ్ విలువ క్షీణిస్తుంది. దీంతో.. మదుపరులు బంగారంమీద పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రబావం మన రూపాయి మీద పడి దాని విలువ కాస్తా పడిపోతుంది. మరి.. మన రూపాయి విలువ దారుణంగా పడిపోతే.. మన ఆర్థిక వ్యవస్థ ఎంతగా ప్రభావితం అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. చాలానే విషయాలకు సంబంధించి బ్రెగ్జిట్ ప్రభావం మన మీద పడుతుంది.
మనమే బాధితులమా?
బ్రెగ్జిట్ కారణంగా మన దేశం ఒక్కటే బాధితురాలా? అంటే కాదనే చెప్పాలి. మనకంటే అగ్రరాజ్యమైన అమెరికాకు భారీ నష్టం వాటిల్లుతుంది. అగ్రరాజ్యమైన అమెరకాకే అంత దెబ్బంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు మరెంత నష్టమన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా.. బ్రిటన్ దేశాల మధ్య లక్షల కోట్ల రూపాయిల వ్యాపార ఒప్పందాలు నడుస్తుంటాయి. వీటన్నింటి మీదా బ్రెగ్జిట్ ప్రభావం ఉంటుంది. అందుకే.. బ్రిటన్ పౌరులకు అమెరికా అధ్యక్షుడు సైతం యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావొద్దంటూ సూచన చేస్తున్న పరిస్థితి.
ఇంతా చేసి.. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావటం బ్రిటన్ కు లాభమా? అంటే అది ఉండదనే వాదన బలంగా వినిపిస్తున్నారు. కూటమి నుంచి వైదొలిగితే ఉద్యోగాలు భారీ ఎత్తున పోతాయని.. కరెన్సీ భారీగా నష్టపోతుందని చెబుతున్నారు. ఐరోపా కూటమి ప్రయోజనాలకు బ్రిటన్ దూరం అవుతుంది. ఇలాంటివెన్నో ఉండటంతో బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఒక చక్కటి ఉదాహరణ చెబుతూ..‘‘ప్రజలు ఇచ్చే తీర్పు శిలాశాసనం. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలని మీరు భావిస్తే.. భవిష్యత్తులో దీన్ని ఎప్పటికీ మార్చలేం. ప్రయాణించే విమానంలో నుంచి దూకాలని ప్రయత్నించకండి. మళ్లీ ఎక్కడం అసాధ్యం. ఒక్కసారి మనం వైదొలిగితే అపార నష్టం వాటిల్లుతుంది’’ అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు.
ఇంతకీ ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయన్న విషయాన్ని చూస్తే.. మరింత గందరగోళం పడటం ఖాయం. ఎందుకంటే.. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలనుకునే వారికి.. వద్దనుకునే వారికి మధ్య వ్యత్యాసం ఒక్క శాతం మాత్రమే. ఇందులో కాస్త ఎక్కువ తక్కువ అయి బయటకు రావాలన్న నిర్ణయాన్ని కానీ గ్రేట్ బ్రిటన్ ప్రజానీకం కానీ తమ ఓట్లతో తేలిస్తే.. ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దిగబడటం ఖాయం. అయితే.. బ్రిటన్ ప్రజల నిర్ణయం ఏమిటన్నది రేపటికి తేలిపోనుంది. మనవరకూ మనం అంతా మంచే జరగాలని కోరుకుందాం. అంతకు మించి ఏం అనుకున్నా.. అదేదీ మన చేతుల్లో లేదుగా.