బయటకు వెళ్లేందుకే బ్రిటనోడు ‘ఓటు’

Update: 2016-06-24 06:04 GMT
గత కొద్దిరోజులుగా ప్రపంచానికి పెద్ద ప్రశ్నగా మారిన బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్న డిమాండ్ పై యూకేలో నిర్వహించిన రెఫరెండమ్ ఫలితాలు వెలువడుతున్నాయి. భారత కలామానం ప్రకారం గురువారం అర్థరాత్రి నుంచి ఫలితాలు వెలువడటం మొదలయ్యాయి. మొదటి నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకే బ్రిటన్ వాసులు మొగ్గు చూపినట్లుగా కనిపించింది.

కొన్ని గంటల తర్వాత కాసేపు మాత్రం యూరోపియన్ యూనియన్ లో ఉండేలా ఫలితాల సరళి కనిపించినా.. వెంటనే తన పాత తీర్పునే కొనసాగించేలా తదుపరి ఓట్ల లెక్కింపు స్పష్టం చేసింది. యూకేలోని నాలుగుభాగాలైన ఇంగ్లండ్.. నార్త్నన్ ఐర్లాండ్.. స్కాట్ లాండ్.. వేల్స్ లలో ఒక్క ఇంగ్లండ్ తప్ప మిగిలిన మూడు ప్రాంతాల్లో ఫలితాల వెల్లడి పూర్తయ్యాయి.  ఈ మూడు భాగాల్లో వేల్స్ లో యూనియన్ నుంచి బయటకు వెళ్లాలన్నది ఎక్కువగా కనిపించటం గమనార్హం.

వేల్స్ తర్వాత నార్త్నన్ ఐర్లాండ్ వాసులు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్లేందుకే మొగ్గు చూపగా.. ఆ తర్వాతి స్థానంలో స్కాట్ లాండ్ వాసులు ఉన్నారు. ఇంగ్లండ్ ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం సాగుతున్న ట్రండ్ ను చూస్తే.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటనోడు బయటకు వెళ్లేందుకు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News