'పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నది సామెత..' ఏ బుర్రలో ఎలాంటి ఆలోచన మెదులుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అయితే.. ఇప్పుడు యూత్ ఏం చేసైనా సరే.. సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తోంది. ఆ సెన్సేషన్ తామే నమోదు చేయాలి.. అందులోనూ తామే ఉండాలని విపరీతంగా ఆరాటపడుతోంది. ఈ ఆరాటంలో వింత వింత ఐడియాలు పుట్టకొస్తున్నాయి.
ఈ కారు మీద కూర్చున్న యువతి పెళ్లి కూతురు. మరి, పెళ్లంటే మున్మందు కాపురం ఎలా ఉంటుందో.. సంసారాన్ని ఎలా చక్కదిద్దుకుంటారో తెలియదుగానీ.. పెళ్లి మాత్రం రచ్చ రంబోలా అనేలా జరిగిపోవాలి. దీనికోసం కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్లు ప్లాన్ చేస్తే.. మరికొందరు పెళ్లిలోనే వింత వింత ఆలోచనలు చేస్తుంటారు. ఇలా పుట్టిన ఆలోచనే ఇది.
మగధీర సినిమాలోని మిత్ర వింద మాదిరిగా రాజసాన్ని ఒలికిస్తూ.. పెళ్లి మండపంలో అడుగు పెట్టేందుకు నిర్ణయించుకుంది. ఇది బహుశా వీడియో గ్రాఫర్ పుర్రెలో మెదిలిన ఆలోచనే కావొచ్చు. ఇలాంటి ఐడియాలన్నీ వాళ్లకే పుట్టుకొస్తుంటాయి. కొత్తగా ట్రై చేద్దామని వాహనం బానెట్ పై పెళ్లి కూతురిని కూర్చోబెట్టారు. ముందు బైక్ పై వీడియో గ్రాఫర్ వీడియో తీస్తుండగా.. వెనుక వాహనం అలా వచ్చేసింది. పెళ్లి మండపం వరకూ ఇదే విధంగా తీసుకెళ్లారు.
హబ్బా.. కేక అనుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మరి, ఈ ఘనత అందరికీ చూపించకపోతే గుర్తింపు ఎలా వస్తుందీ? అందరూ మెచ్చుకుంటేనే చేసిన దానికి తృప్తి కాబట్టి.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది చూసిన కొందరు ఆహా.. ఓహో.. మరికొందరు తిట్టిపోశారు. అయితే.. ఇది చూసిన పోలీసులు మాత్రం డైలాగ్స్ పక్కనపెట్టి యాక్షన్ లోకి దిగారు.
ఇది వాహన చట్టానికి విరుద్ధమని కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. పెళ్లి కూతురు సహా.. ఎవ్వరూ మాస్కులు ధరించలేదు. ఇది కరోనా నిబంధనలు ఉల్లంఘించడమేనని అందరిపైనా కేసు పెట్టారు. అసలే.. మహారాష్ట్రలో కరోనా ఎంతకీ తగ్గట్లేదన్న సంగతి తెలిసిందే. దీంతో.. చిర్రెత్తిన పోలీసులు అందిరిపైనా కేసు పెట్టారు. ఆ విధంగా.. క్రియేటివిటీ ఎక్కువై, ఎక్కువ చేయడంతో.. పోలీసులు తగ్గించేశారు. ఏదైనా హద్దుల్లో ఉంటేనే అందం.. పద్ధతిగా సాగిపోతేనే ముద్దూ ముచ్చట! అతి చేస్తే.. పెంట పెంట కావడమే కాకుండా.. ఇలా ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.
Full View