రౌడీలకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన సామాన్యుడు

Update: 2016-03-07 09:34 GMT
సామాన్యుడు అనగానే అలవాటులో పొరపాటుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చెప్పబోయేది ఆయన గురించి ఎంతమాత్రం కాదు. ఒక అసలుసిసలు సామాన్య వ్యక్తి గురించి చెప్పబోతున్నాం. తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే మోసాలు.. అవినీతి గురించి.. ప్రభుత్వంలో జరిగే మోసాల గురించి ప్రపంచానికి చెప్పే సాదాసీదా సమాచార హక్కు కార్యకర్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.

బ్రిజిరాజ్ కిషన్ అనే ఇతగాడు.. ఈ మధ్యన ఒక అర్జీ దాఖలు చేశాడు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అక్రమ సంపాదన తెలుసుకునేందుకు వీలుగా ఒక అర్జీ పెట్టాడు. అంతే.. అప్పటి నుంచి అతన్ని చంపేస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విసిగిపోయిన ఈ సామాన్యుడు.. అందరి తరహాలో కాకుండా కాస్త భిన్నంగా రియాక్ట్ అయ్యాడు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన కిషన్.. తనను చంపేస్తామని కొందరు రౌడీలు వార్నింగ్ లు ఇస్తున్నారని.. ఎవరో నేరస్తుల చేతిలో హత్యకు గురి కావటం కన్నా.. తమ లాంటి పెద్దోళ్లు పర్మిషన్ ఇస్తే.. నేనే ఆత్మహత్య చేసుకుంటానని తన కడుపు మంటను చాలా మర్యాదగా లేఖ రాశారు. ఇక.. ఈయన గారి బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. ఇప్పటికే పలువురు అవినీతి అధికారుల బతుకుల్ని బట్టబయలు చేయటమే కాదు.. అవినీతి అధికారులకు సింహస్వప్నంగా ఉన్నాడీ సామాన్యుడు. ఇలాంటి వ్యక్తి తనకు తానుగా చనిపోయే అవకాశం రాష్ట్రపతి ఇవ్వాలంటూ.. తనకు ఎదురైన సమస్యను దేశ ప్రధమ పౌరుడి దృష్టికి తీసుకెళ్లటంతో ఇది కాస్తా మీడియాలోకి వచ్చింది. మరి.. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో చూడాలి.
Tags:    

Similar News