మాయావతి రాజకీయం మొదలైంది..

Update: 2017-01-27 10:56 GMT
కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న యూపీలో రాజకీయం స్పీడయింది. సమాజ్ వాది పార్టీ - బీజేపీలు మెయిన్ ప్లేయర్లుగా అంతా చెబుతున్న తరుణంలో మాజీ సీఎం - బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ కాషాయ అజెండా.. ములాయం కుటుంబంలో రచ్చను అడ్డుపెట్టుకుని ముస్లింలు - దళితులను తన వెంట వచ్చేలా చేయాలనుకుంటున్న మాయ దాంతో పాటు ఇతర చిన్నచితకా పార్టీలనూ తమలో కలిపేసుకుంటున్నారు. తాజాగా ముఖ్తార్ అన్సారీకి చెందిన ఖవామీ ఏక్తా దళ్ (క్యూఈడీ) పార్టీని విలీనం చేసుకున్నారు.
    
ఖవామీ ఏక్తాదళ్ ను విలీనం చేసుకుని  ఆ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు అసెంబ్లీ టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్తార్ తో పాటు అతని ఇద్దరు కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున టికెట్లు ఇస్తున్నట్టు తెలిపారు. కేవలం మూడు సీట్లను ఆఫర్ చేసి ఓ ముస్లిం పార్టీని ఆమె తన పార్టీలో కలిపేసుకోవడంతో ఎస్పీ - బీజేపీలు షాకయ్యాయి.
    
కాగా ముఖ్తార్ ఓ గ్యాంగ్ స్టర్ గా, పలు కేసుల్లో ఇరుక్కుని, జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే.. ఆయనకు ముస్లింల్లో మంచి పట్టుంది.  యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన పార్టీకి ముస్లింల మద్దతు బలంగా ఉండటంతోనే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News