మరోసారి విమర్శలపాలైన బ్రిటన్ ప్రధాని.. వీడియో వైరల్..!

Update: 2022-12-28 11:10 GMT
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి విమర్శల పాలయ్యాడు. ఇటీవల లండన్ లోని ఓ షెల్టర్ హోంను సందర్శించిన రిషి సునాక్ అక్కడే ఉన్న ఓ నిరాశ్రయుడితో సంభాషించారు. అయితే ఆ వ్యక్తి మాటలను రుషి సునాక్ పట్టించుకోలేదు. ఈ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రధానిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ ప్రధానిగా రుషి సునాక్ నూతనంగా ఎన్నికైన తర్వాత నుంచి దేశంలో పలు సంస్కరణలు చేపడుతున్నారు. గాడితప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తాజాగా లండన్ లోని ఓ షెల్టర్ హోమ్ ను రిషి సునాక్ సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడి సూప్‌ కిచెన్‌లోకి వెళ్లిన రిషి సునాక్ స్వయంగా వెళ్లి నిరాశ్రయులకు వడ్డించారు. భోజనం వడ్డిస్తున్న సమయంలో రాత్రి నిద్రించేందుకు ఓ వ్యక్తికి స్థలం దొరకక ఇబ్బందులు పడుతున్నాడు. అతడిని గమనించిన రిషి సునాక్ అతడితో నేరుగా మాట్లాడారు. ఆ వ్యక్తి పేరు.. వృత్తి సంబంధిత విషయాలపై ఆరా తీశారు.

ఏమైనా తింటారా? అని అడిగాడు. తర్వాత ఆ వ్యక్తికి సాసేజ్.. టోస్ట్.. గుడ్ల ప్లేట్ తోపాటు వాటర్ బాటిల్ ను రుషి సునాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా వీరిమధ్య చిన్నపాటి సంభాషణ జరిగింది. మీరు ఏదైనా పని చేస్తారా? అని రుషి సునాక్ అతడిని అడగా దానికి ఆ వ్యక్తి బదులిస్తూ  మీరు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటూ ప్రధానిని అడిగాడు.

ఇక ఆ తర్వాత సునాక్ మీరు ఏదైనా వ్యాపారంలో ఉన్నారా? అని ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. దీనికి అతడు స్పందిస్తూ లేదు సార్.. తాను నిరాశ్రయుడినని చెప్పాడు. అయితే తనకు వ్యాపారంపై ఆసక్తి ఉందని జవాబిచ్చాడు. అనంతరం తనకు ఉండటానికి ఇల్లు లేదని.. ఎక్కడైనా వసతి కల్పించాలని కోరాడు. అయితే ఆ నిరాశ్రయుడి చెప్పే విషయాన్ని రిషి సునాక్ పెద్దగా పట్టించుకోకుండా మరో విషయంపై మాట్లాడారు.

ఇందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంగ్లండ్‌లోని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకురాలు ఏంజెలా రేనర్ ట్విట్టర్లో స్పందించారు. ఇది విచారకరమైన.. బాధాకరమైన పరిస్థితి ఈ విషయంపై తాను ఆందోళన చెందుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నెటిజన్లు సైతం ప్రధాని సునాక్ ప్రజల సమస్యలను విస్మరించరాదని.. నిరాశ్రయులైన వారికి వసతి కల్పించాలని కామెంట్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News