కరోనా వ్యాక్సినేషన్‌ పై బ్రిటన్ సంచలన నిర్ణయం .. ఏంటంటే

Update: 2021-06-09 11:30 GMT
కరోనా విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా ఇంకా తగ్గలేదు. ఒక్కో దేశంలో ఒక్కో కొత్త కరోనా వేరియంట్ పుట్టుకొస్తున్నాయి. కొత్త వేరియంట్లను కూడా తట్టుకుని నిలిచేలా ఆయా దేశాలు వ్యాక్సినేషన్‌ లో మార్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ కూడా వ్యాక్సినేషన్‌ పై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని తగ్గించింది. భారత్‌ లో గుర్తించిన డెల్టా వేరియంట్‌ కు శక్తి ఎక్కువని  ప్రపంచ ఆరోగ్య సంస్థ   ఇటీవల ఆందోళన వ్యక్తంచేయడం తెలిసిందే.

ఇలాంటి ప్రమాదకరమైన వేరియంట్లు ముందుముందు మరిన్ని పుట్టుకొచ్చే అవకాశముంది. రెండో డోసును ఆలస్యం చేస్తే కొత్త వేరియంట్లు వ్యాక్సిన్‌ కు లొంగటం కష్టమేనన్న బ్రిటన్ వైద్య నిపుణుల హెచ్చరించారు. ఆ మేరకు యూకేలో రెండు డోసుల మధ్య అంతరాన్ని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గించారు. మన దేశంలో కూడా రెండు డోసుల మధ్య అంతరం తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ మేరకు సీడీసీ, సీఎస్ఐఆర్, ఐజీబీ పరిశోధకులు కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం
కోవీషీల్డ్
వ్యాక్సిన్ తొలి డోస్, రెండో డోస్ మధ్య అంతరం 12-16 వారాలుగా ఉంది. ఆ రెండు డోసుల మధ్య అంతరం దేశ దేశానికి విభిన్నంగా  ఉన్నాయి.

దీనిపై ప్రారంభంలో యూకేలో వివాదం నడిచింది. రెండు డోసుల మధ్య అంతరం ఎంత ఉండాలన్నదానిపై నిఫుణుల మధ్య  ఏకాభిప్రాయం లోపించింది. యూకేలో ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనికా, ఫైజర్-బయోఎన్ టెక్ ఎంఆర్ ఎన్ ఏ వ్యాక్సిన్ వినియోగంలో ఉంది. అయితే కొత్త వేరియంట్ బి.1.617.2 లేదా డెల్టా రకం వ్యాప్తి పెరగడంతో వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరాన్ని తగ్గించింది యూకే ప్రభుత్వం. బ్రిటన్‌లో తొలి డోస్ అనంతరం 33శాతం మాత్రమే రెండు కంపెనీల వ్యాక్సిన్లు ప్రభావం చూపాయి. ఆస్ట్రాజెనికా రెండో డోస్ తర్వాత ప్రభావం 60శాతంగా ఉండగా పైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తర్వాత ప్రభావం 88 శాతంగా ఉంది.
Tags:    

Similar News