బ్రిటీష్ ఎయిర్ వేస్ క‌స్ట‌మ‌ర్ల క్రెడిట్ కార్డులు హ్యాక్!

Update: 2018-09-08 05:59 GMT
ప్ర‌ఖ్యాత విమాన సంస్థ‌ల్లో ఒక‌టైన బ్రిటీష్ ఎయిర్ వేస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. త‌మ విమానాల్లో ప్ర‌యాణాలు చేయాల్సిన వినియోగ‌దారులు త‌మ క్రెడిట్ కార్డుల్ని వెంట‌నే బ్లాక్ చేసుకోవాల‌ని సూచించింది. త‌మ వ‌ద్ద క‌స్ట‌మ‌ర్లు న‌మోదు చేసిన క్రెడిట్ కార్డుల వివ‌రాలు హ్యాకింగ్‌కు గురైన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.

ఆగ‌స్టు 31 నుంచి సెప్టెంబ‌రు 5 వ‌ర‌కు బ్రిటీష్ ఎయిర్ లైన్స్ సంస్థ‌కు చెందిన మొబైల్యాప్ ద్వారా ఎయిర్ వేస్ టికెట్లు బుక్ చేసుకున్న 3.5 ల‌క్షల మంది ప్ర‌యాణికులు వెంట‌నే త‌మ క్రెడిట్ కార్డుల‌ను బ్లాక్ చేసుకోవాల్సిందిగా కోరింది. త‌మపై జ‌రిగిన హ్యాకింగ్ దాడి ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌కుండా ఉండ‌టం త‌మ క‌ర్త‌వ్యంగా పేర్కొంటొంది.

వినియోగ‌దారులు వెల్ల‌డించిన వివ‌రాలు దుర్వినియోగం కాకుండా ఆపేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా బ్రిటీష్ ఎయిర్ వేస్ సీఈవో అలెక్స్ క్రూజ్ వెల్ల‌డించారు. కొంత‌లో కొంత సాంత్వ‌న క‌లిగించే వ్య‌వ‌హారం ఏమంటే.. ఎయిర్ వేస్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఈ మ‌ధ్య‌న టికెట్లు బుక్ చేసిన వారి క్రెడిట్ కార్డు డిటైల్స్ హ్యాక్ అయ్యాయి.. అయితే క్రెడిట్ కార్డు పాస్ వ‌ర్డ్  మాత్రం హ్యాక్ కాలేద‌ని పేర్కొంది. త‌మ క్రెడిట్ కార్డుల్ని ఎవ‌రో వాడుకున్న‌ట్లుగా త‌మ‌కు ఫోన్లు వ‌చ్చిన‌ట్లుగా ఎయిర్ వేస్ వెల్ల‌డించింది.

బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్ర‌క‌ట‌న‌ల మీద ప‌లువురు మండిప‌డుతున్నారు. డిజిట‌ల్ స‌ర్వీసులు అందించే ప్ర‌య‌త్నంలో క‌నీస భ‌ద్ర‌త కూడా క‌ల్పించ‌ని వైనాన్ని త‌ప్పు ప‌డుతున్నారు.ఎందుకంటే ఈ సంస్థ‌కు ఐటీ సంబంధిత స‌మ‌స్య త‌లెత్త‌టం ఇది మొద‌టిసారి కాదంటున్నారు.

గ‌త ఏడాది మేలో కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ‌లోని లోపాల కార‌ణంగా 700 విమానాలు హ‌టాత్తుగా ర‌ద్దుకావ‌టం జ‌రిగింది. ఆ సంద‌ర్భంలోనూ పెద్ద ఎత్తున ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ఈ ఉదంతంలో దాదాపు 75 వేల మంది ప్ర‌యాణికులు తీవ్ర అవ‌స్థ‌ల‌కు గుర‌య్యారు. ఎయిర్ పోర్టుల‌లో ఆగిపోయారు. తాజాగా క్రెడిట్ కార్డు వివ‌రాలు హ్యాకింగ్ కు గురి కావ‌టం షాకింగ్ గా మారింది. సంస్థ తీరుపై ప‌లువురు మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News