ఈ బుల్లిస్టాంప్ ఖరీదు మీరు కలలో కూడా ఊహించలేరు

Update: 2023-01-13 23:30 GMT
అదొక స్టాంపు. అదేనండి పోస్టాఫీసులో జారీ చేసే స్టాంపు. కానీ.. దాని విలువ లెక్క తెలిస్తే నోట మాట రాదంతే.  దాదాపు 167 ఏళ్ల క్రితం నాటి ఈ స్టాంపు విలువ ఒక సెంట్.

అంటే.. నాలుగు పైసలు. కట్ చేసి.. ఇప్పుడు ఆ స్టాంపు విలువ ఎంతో తెలుసా? అంచనా వేయటానికి మీరెంత ప్రయత్నించినా (గూగుల్ సాయం తీసుకోకుండా) దీని ధరను అంచనా వేయటంలో మాత్రం తప్పులో కాలేయటం ఖాయం. బరువు ప్రకారం చూసుకుంటే.. 40 మిల్లీ గ్రాములు. కానీ.. దీని విలువ మాత్రం కోట్లాది రూపాయిలు కావటం విశేషం.

1856లో బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు తాజాగా నిర్వహించిన వేలంలో రూ.70.33 కోట్ల విలువ పలికింది. ఎందుకింత? అంటే.. ఇది పురాతన కాలం నాటిది కావటమే దీనికి కారణం. అప్పట్లో ముద్రించిన ఈ స్టాంపు ఇదొక్కటే మిగిలింది. దీంతో.. దీని విలువ ఇంత భారీగా పెరిగింది.

ప్రపంచంలో అత్యంత తక్కువ బరువుతో ఉన్న ఒక వస్తువు ధర ఇంత భారీగా ఉండటం.. ఈ స్టాంపు స్పెషల్ గా చెప్పాలి.

స్టాంపు బరువు ఉన్న నాణ్యమైన వజ్రం ధర మన రూపాయిల్లో 58వేలు పలికితే.. అత్యంత ఖరీదైన డ్రగ్స్ ధరలో లెక్కిస్తే రూ.4.13 లక్షలు మాత్రమే. కానీ.. ఈ స్టాంపు మాత్రం కొన్ని వేల రెట్లు ఎక్కువని చెప్పొచ్చు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ స్టాంపును ఇప్పటివరకు తొమ్మిది మంది యజమానుల చేతులు మారింది.

ఇటీవల నిర్వహించిన వేలంలో ఈ అత్యంత ఖరీదైన స్టాంపును స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ సొంతమైంది. రానున్న రోజుల్లో దీని ధర మరింత పెరుగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
Tags:    

Similar News