ట్రంప్‌ ను ఏసెయ్య‌బోయాడు

Update: 2016-06-21 07:23 GMT
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగింది. లాస్‌ వెగాస్‌ లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌ పై దాడి చేయడానికి 19 ఏళ్ల బ్రిటిష్‌ యువకుడు ప్రయత్నించాడు. పోలీస్‌ అధికారి దగ్గర ఉన్న తుపాకీ లాక్కొనేందుకు యత్నించాడు. అప్పటికే అలర్ట్ అయిన పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను ట్రంప్‌ ను చంపడానికి కాలిఫోర్నియా నుంచి లాస్‌ వెగాస్‌ వచ్చినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

ట్రంప్‌ పై దాడి చేయడానికే.. ర్యాలీకి ఒకరోజు ముందు తుపాకీ పేల్చడం నేర్చుకున్నానని.. అంతకుముందు తాను ఎప్పుడూ తుపాకీ పేల్చలేదని చెప్పాడు. మహా అయితే ఒకటి - రెండు రౌండ్లు మాత్రమే కాల్చగలనని.. తర్వాత భద్రతా సిబ్బంది తనను కాల్చేస్తారని ముందే తెలుసని పేర్కొన్నాడు. ఫొయెనిక్స్‌ లో ట్రంప్‌ ప్రచార ర్యాలీకి కూడా టిక్కెట్‌ కొనుక్కున్నట్లు విచారణలో వెల్లడించాడు. లాస్‌ వెగాస్‌ లో ట్రంప్‌ పై దాడి చేయడంలో విఫలమైతే మళ్లీ దాడి చేయాలని అనుకున్నట్లు తెలిపాడు.

సాండ్‌ ఫోర్డ్‌ అమెరికాలో గత 18 నెలలుగా ఉంటున్నాడు. హోబోకెన్‌ - న్యూజెర్సీల్లో ఉన్న తర్వాత అతడు కాలిఫోర్నియా చేరుకున్నాడు. లాస్‌వెగాస్‌ ర్యాలీలో అమీల్‌ జాకోబ్‌ అనే పోలీస్‌ అధికారి గన్‌ అన్‌ లాక్‌ లో ఉందని, అదైతే సులువుగా కాల్పులు జరపొచ్చని ఆయన గన్‌ లాక్కొనే ప్రయత్నం చేసినట్లు విచారణలో యువకుడు పోలీసులకు తెలిపాడు. తాను గన్‌ తెచ్చుకుని ఉంటే మెటల్‌ డిటెక్టర్‌ లో దొరికిపోతాను కాబట్టి తేలేదని వివరించాడు. గతేడాదిగా సాండ్‌ ఫోర్డ్‌ ట్రంప్‌ ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. చివరిగా ఇప్పుడు దాడి చేసే యత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News