అక్కాతమ్ముడు చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలువురి నోట నానుతోంది. వీరిద్దరు తమ పేరెంట్స్‌కు సర్ ప్రైజ్ చేద్దామన్న ప్లాన్ పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. తమ నిర్ణయంతో వారి పేరెంట్స్ మనసుల్ని దోచుకోవటమే కాదు.. పలువురికి స్ఫూర్తిగా నిలిచిన వారేం చేశారన్న విషయంలోకి వెళితే..
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్యన ఒక రోజు స్థానికంగా ఉండే హోండా షోరూంకు 13 ఏళ్ల కుర్రాడు హడావుడిగా వచ్చాడు తన అక్కతో. పెద్ద మూటను తమ అంకుల్ సాయంతో తెచ్చిన వారు.. ఆ షోరూం యజమానితో సహా.. సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఎనిమిదో తరగతి చదివే యశ్.. అతని అక్క ఇద్దరు కలిసి తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని రెండేళ్లుగా దాచి పెడుతున్నారు. చివరకు రూ.62వేల మొత్తాన్ని చేసిన వారు.. ఆ మొత్తాన్ని తీసుకొని షోరూంకు వచ్చారు. వాస్తవానికి వారు వచ్చే వేళకు.. షోరూం మూసే టైం అయ్యింది. కానీ.. తండ్రికి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఆ అక్కాతమ్ముళ్ల అతృత గుర్తించిన షోరూం సిబ్బంది..వారు తెచ్చిన మొత్తాన్ని ఓపిగ్గా లెక్కించి మరీ బండిని అందజేశారు.
రెండేళ్లుగా తాము దాచిన పాకెట్ మనీ మొత్తాన్ని నోట్ల రూపంలో కాకుండా నాణెల రూపంలో ఉంచటంతో.. దాన్ని లెక్కించే విషయంలో షోరూం సిబ్బంది ఇబ్బంది పడినా.. ఇలాంటివి ఇప్పటివరకూ తాము చూడలేదని.. అందుకే అంత ఓపిగ్గా కూర్చొని లెక్కించినట్లుగా చెబుతున్నారు. రాత్రివేళ.. అనుకోని రీతిలో కస్టమర్ రూపంలో వచ్చిన ఈ అక్కాతమ్ముళ్ల తీరుకు ఆశ్చర్యపోయిన షోరూం యజమాని.. వారు తెచ్చిన డబ్బు సరిపోవటంతో వారు కోరుకున్న బండిని డెలివరీ చేశారు. తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలన్న ఈ అక్కాతమ్ముళ్ల అతృత షోరూం యజమానినే కాదు.. ఈ ఉదంతం గురించి తెలిసిన ప్రతిఒక్కరూ సర్ ప్రైజ్ కు గురి అవుతున్నారని చెప్పక తప్పదు.