ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ లో త్వరలో పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యం అంటూ షర్మిల కొత్త పార్టీ పై హింట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిలతో మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ భేటీ అయ్యారు. అనంతరం బ్రదర్ షఫీ మాట్లాడుతూ.. షర్మిల ఆహ్వనం మేరకు ఆమెతో సమావేశమయ్యానని తెలిపారు. తామిద్దరం అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. వైఎస్ ఆశయాలతో ముందుకెళ్లాలని, తెలంగాణలో మార్పు కోసం పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల ఆలోచిస్తున్నారు అని తెలిపారు.
షర్మిలలో వైఎస్ కనిపించారని, ఆయన నాయకత్వ లక్షణాలు కనిపించాయని షఫీ ప్రశంసలు గుప్పించారు. అతి త్వరలోనే మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారన్నారు. ఈ మార్పునే నేను కోరుకున్నాను. మన ప్రాంతం కోసం, మన భవిష్యత్తు కోసం మనం పని చేసే తరుణం వచ్చిందని షఫీ అన్నారు. పార్టీలో చేరే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఏ బాధ్యతలు తీసుకోవాలనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో మీకు తెలుస్తుంది. మోటివేషన్ ఉద్దేశమే జీవితంలో, సమాజంలో మార్పు రావడం. జీవితంలో మార్పు రావాలంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. ప్రజల జీవితాలను తీర్చి దిద్దేలా మార్పు రావాలి. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తే.. వారి జీవితాల్లో మార్పు వస్తుందని షఫీ వ్యాఖ్యానించారు. పార్టీలో చేరుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఏ విధంగా బాధ్యతలు తీసుకుని ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే మరిన్ని విషయాలు చెబుతామన్నారు.
బ్రదర్ షఫీ అనే పేరు యూట్యూబ్ లో బాగా ఫేమస్. ఆయన మోటివేషనల్ స్పీకర్. ‘BR SHAFI నేను సైతం సమాజం కోసం’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఆయనకు 1.71 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్ మెంట్, ఓటమి, విజయాలు, పరాజయాలు.. ఇలా భిన్నమైన అంశాలపై ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటారు. ఆయన ప్రసంగాలు యూట్యూబ్ లో చాలా పాపులర్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.