టీఆర్ ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తెలంగాణ అధికార పార్టీ తాజాగా సత్తా చాటింది. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన తర్వాత.. వచ్చిన తొలి సంస్థాగత ఎన్నికల్లో ప్రభంజనం చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్తు సరఫరా సంస్థ(సెస్) డైరెక్టర్ల స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలనూ కైవసం చేసుకున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో అమీతుమీకి సిద్ధమైన బీజేపీ పూర్తిగా చతికిలపడింది.
వేములవాడ గ్రామీణ స్థానం ఫలితం.. తొలుత బీజేపీ దక్కించుకుంది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి జక్కుల తిరుపతికి 6 ఓట్ల మెజారిటీ వచ్చిందని ప్రచారం జరిగింది. వెంటనే అలెర్ట్ అయిన బీఆర్ ఎస్ మద్దతుదారు దేవరాజ్ రీకౌంటింగ్ చేపట్టాలని అధికారులను కోరడంంతో రీకౌంటింగ్ చేశారు.
ఈ క్రమంలో దేవరాజ్ విజయం సాధించారు. ఇక, చందుర్తి స్థానం లెక్కింపులో చివరి రెండు రౌండ్లు మిగిలి ఉండగా అధికార పార్టీ వారితో ఎన్నికల సిబ్బంది లాబీయింగ్ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.
దీంతో కొద్దిసేపు లెక్కింపు నిలిచిపోయింది. ఆ సమయంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అల్లాడి రమేశ్ 18 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆందోళనకారులతో ఎన్నికల అధికారులు మాట్లాడిన తరవాత లెక్కింపు తిరిగి ప్రారంభించారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ బలపరిచిన శ్రీనివాస్‌రావుకు రెండు ఓట్ల మెజారిటీ వచ్చింది.
గంభీరావుపేట స్థానం ఓట్ల లెక్కింపునకు స్ట్రాంగ్ రూం నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్ పెట్టెకు సీలు తీసి ఉందంటూ స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు ఆందోళనకు దిగారు. ఏదేమైనా చివరి ఫలితం వచ్చేసరికి మాత్రం బీఆర్ ఎస్ మద్దతు దారులుగా రంగలోకి దిగిన 15 మంది డైరెక్టర్‌లు విజయం దక్కించుకున్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ ఎస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.