ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతా అన్నట్టు ఉందని కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పై విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా సొంత కుమార్తెను ఎంపీగా గెలిపించుకోలేని కేసీఆర్ బీఆర్‌ఎస్ అంటూ హడావుడి చేస్తుండటాన్ని ఎద్దేవా చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో సైతం కేసీఆర్ తల్లకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో 17కి 17 ఎంపీ సీట్లు రావని.. ఇందులో సగం సీట్లు సాధించినా అది గొప్పేనని అంటున్నారు. తనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్‌ఎస్ పేరిట కేసీఆర్ హడావుడి చేస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీఆర్‌ఎస్ లో చేరతారని చెబుతున్న నేతలు కూడా రకరకాలు పార్టీలు మారి.. ఇక ఎక్కడా అవకాశం లేకపోవడం వల్లే బీఆర్‌ఎస్ లో చేరుతున్నారని అంటున్నారు. ఏపీ ప్రజల్లో మాత్రం బీఆర్‌ఎస్ ఊసే ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ లో చేరడానికి సిద్ధమైన తోట చంద్రశేఖర్ ఇప్పటికే ప్రజారాజ్యం, వైసీపీ, జనసేన పార్టీల్లోకి వచ్చి వెళ్లారని అంటున్నారు. ఇప్పటికే ఆయన మూడు పర్యాయాలు ఓడిపోయారని గుర్తు చే స్తున్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఇలా మూడు సార్లు పోటీ చేసినా మూడుసార్లు ఓడిపోయారని చెబుతున్నారు.
అలాగే రావెల కిశోర్ బాబు సైతం టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లోకి జంప్ చేసి మళ్లీ ఎక్కడా అవకాశం లేక బీఆర్‌ఎస్ లోకి వెళ్తున్నారని అంటున్నారు. ఈ నాయకుల వల్ల బీఆర్‌ఎస్ కు ఒక్క ఓటు రాదని.. అలాగే ఈ నేతలకు సైతం డిపాజిట్లు కూడా రాబోవని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా మూడు పార్టీలు అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వీటికి తోడు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్‌ఎస్ ఏపీలో చూపించే ఫలితం శూన్యమని వివరిస్తున్నారు.
అందులోనూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను అనరాని మాటలన్నీ అని.. తిట్టిన తిట్టు తిట్టకుండా ఏ ముఖం పెట్టుకుని ఏపీలో కేసీఆర్ ఓట్లు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు గడిచిపోయినా కేసీఆర్ ఆంధ్రులను అన్నమాటలను, ఆ పార్టీ నేతలు ఏపీ ప్రజల విషయంలో చేసిన ఓవరాక్షన్ ను ఏపీ ప్రజలెవరూ మర్చిబోరని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ కు గడ్డు పరిస్థితులు తప్పవని.. అధికారంలోకి వచ్చేది రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీయేనని తేలడంతోనే కేసీఆర్ బీఆర్‌ఎస్ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అందులోనూ బీఆర్‌ఎస్ లోకి వెళ్లాలని అనుకుంటున్న నేతలను ఏపీ ప్రజలు వింతగా చూస్తున్నారు. నేతలు చేరినా ఏపీ ప్రజల్లో మాత్రం బీఆర్‌ఎస్ కు ఎలాంటి ఆదరణ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.