కేసీఆర్ విభజన వాది.. ఉమ్మడిగా ఉన్న ఏపీని రెండు ముక్కలు చేసిన ఉద్యమకారుడు. కేసీఆర్ స్వరాష్ట్ర కాంక్ష కారణంగానే ఇప్పుడు విభాజిత ఏపీ అప్పల్లో కూరుకుపోయి రాజధాని లేకుండా ఆపసోపాలు పడుతోంది. మరోవైపు తెలంగాణ అభివృద్ధి పథాన నిలుస్తోంది. తెలంగాణలో చక్కబెట్టిన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని ఉద్దరించడానికి బయలు దేరారు. జాతీయ పార్టీ 'బీఆర్ఎస్' పెట్టి ముందుకెళుతున్నారు.
అందుకే అందరూ భావించినట్టు కేసీఆర్ తన తొలి విస్తరణ ఆంధ్రప్రదేశ్ కాదట..ఏపీలో బీఆర్ఎస్ కష్టం అని కేసీఆర్ కు బాగా తెలుసు. ఇప్పుడు ఏపీ ఇంతటి అప్పుల్లో ఉండడానికి రాజధాని కూడా లేకుండా రోడ్డునపడడానికి కేసీఆర్ కారణం. అందుకే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణను పక్కనపెట్టి వేరే రాష్ట్రంపై ఫోకస్ చేశారు.
మహారాష్ట్రలోని చాలా మంది రైతులు కేసీఆర్ పాలన మెచ్చి రైతు బంధు, రైతు బీమా , ఉచిత విద్యుత్ కావాలని అప్పట్లో డిమాండ్ చేశారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్రలోనే తొలి బీఆర్ఎస్ విస్తరణ చేయాలని ప్లాన్ చేశారు. మహారాష్ట్రలోని కొన్ని చిన్న పార్టీలు బీఆర్ఎస్ లో విలీనం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఫోకస్ మొదట ఏపీపై కాకుండా మహారాష్ట్ర వైపు మళ్లింది.
మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న నిర్మల్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈ మేరకు కేసీఆర్ మహారాష్ట్ర బాధ్యతలిచ్చారు. ఇటీవల ఆయన ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు ఇతర సరిహద్దు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మండలాల్లో పర్యటిస్తూ బీఆర్ఎస్ ను ప్రొజెక్ట్ చేస్తున్నారు.
నాందేడ్ ప్రాంతంలో కొంత పట్టు ఉన్న 'స్వతంత్ర భారత పక్ష పార్టీ'ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోని కొన్ని రైతు సంఘాలు, రైతు పార్టీలు కూడా బీఆర్ఎస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీని వ్యతిరేకించే ప్రజాసంఘాలు, యువజన సంఘాలతో కూడా మంత్రి అల్లోల అండ్ టీం చర్చలు జరుపుతోంది.
ఈ క్రమంలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను విస్తరించడమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. జనవరి మొదటి వారంలో నాందేడ్ లో పర్యటించి బీఆర్ఎస్ విస్తరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.దీంతో బీఆర్ఎస్ తొలి అడుగులు ఏపీలో కాదు.. మహారాష్ట్రలో తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.