టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్ గా మార్చి.. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు కలిసి వస్తున్నవా రు ఎవరు? కలిసి వచ్చేవారు ఎవరు? అని లెక్కలు వేసుకుంటే..ఫస్ట్ ప్లేస్‌లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సారథ్యంలో నడుస్తు న్న ఎంఐఎం ముందు వరుసలో నిలుస్తుంది. తర్వాత.. ప్లేస్ కర్ణాటక ప్రాంతీయ పార్టీ, మాజీ సీఎం కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్. ఇవి కాకుండా.. అంటే.. లెక్కకు ఉన్నప్పటికీ.. అవి కలిసివస్తాయో లేదో చెప్పడం కష్టం.
సరే..ఇప్పటికిప్పుడు కేసీఆర్ లక్ష్యం.. దేశవ్యాప్తంగా పార్టీని పరిచయం చేయడం. ప్రజలకు తన మొహాన్ని చూపించడం.. వారి ఆమోదం పొందడం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని లోక్‌సబ ఎన్నికలకు మాత్రమే పరిమితం చేయడం. అదే సమయం లో ప్రాంతీయ పార్టీలను, ముఖ్యంగామోడీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఒడిసిపట్టి.. వారితో బలోపేతం కావడం. ఈ క్రమంలోనే ఎంఐఎంను ఆయన చేరదీస్తున్నారు. వాస్తనికి రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎంఐఎంతో పొత్తు ఉంది.
సొంత టీఆర్ ఎస్(ఇప్పుడు బీఆర్ ఎస్) నేతలు తనను కలవాలన్నా.. అప్పాయింట్‌మెంటు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే.. అసదుద్దీన్ మాత్రం ఎలాంటి అప్పాయింట్‌మెంటు అవసరం లేకుండా..ఎప్పుడు కావాలంటే అప్పుడు కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉంది. అదీ వారి మధ్య ఉన్న పొలిటికల్ `బంధం`. ఇప్పుడు దీనిని ఉపయోగించుకునే కేసీఆర్ ముందుకు సాగాలని అనుకుం టున్నారు. అయితే.. ఇది ఏమేరకు కేసీఆర్‌కు ఫలితం ఇస్తుంది? అనేది చర్చ!
ఎందుకంటే.. అసదుద్దీన్ పైనా.. ఆయన పార్టీపైనా ఒక ముద్రపడిపోయింది. `బీజేపీకి బీ టీమ్` అనే మాట ఉత్తరాదిలో ఎక్కువగా వినిపిస్తుంది. ఉత్తరాదిలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. అక్కడ వాలిపోయి.. బీజేపీ వ్యతిరేక ఓటుబ్యాంకును చీల్చడం ఎంఐఎం ఉద్దేశమనే మాట తరచుగా వినిపిస్తుంది. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ ఇలా.. ఎక్కడ ఎన్నికలు జరిగినా..ఎంఐఎంను బీజేపీకి బీ టీంగానే అభివర్ణిస్తారు. మరి అలాంటి పార్టీని పట్టుకుని కేసీఆర్ ఏమేరకు ముందుకు సాగుతా రు? అనేది ప్రశ్న.
ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ అధికారంలో ఉన్న సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నది కేసీఆరే. ఇక, జగన్‌కు అసదుద్దీన్ మిత్రుడే. సో.. ఆయనకు ఎసరు పెట్టేలా రాజకీయం చేసే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు జగన్‌కు అనుకూలంగా ఉందనే వాదనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ ఎస్ పోటీ ఉంటుందా? లేక.. జగన్ మద్దతు తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.