మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఈ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. ఓ కుటుంబాన్ని వైరస్ విచ్చిన్నం చేసింది. తల్లికి ఐసీయూలో బెడ్ దొరకక చనిపోగా, నానమ్మ ఆస్పత్రి టాయ్ లెట్ లో విగతజీవిగా కనిపించింది. ఓకే ఇంట్లో ఇద్దరూ చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదం నింపింది. జల్గావ్ జిల్లాలో హర్షల్ నెహతా ఫ్యామిలీ ఉంటోంది. ఇతను ఉపాధి కోసం పుణెలో ఉంటున్నారు. ఇతని భార్య మరో నెలరోజుల్లో డెలివరీ కాబోతుంది.
తండ్రి తులసీరాం ఈ వైరస్ సోకి.. నాసిక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోని కోలుకున్నారు. అయితే హర్షల్ తల్లి టీనా, నానమ్మ మాలతీకి కూడా వైరస్ సోకింది. దీంతో టీనాను జల్గావ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఐసీయూలో బెడ్ లేకపోవడంతో దాదాపు ఆరు గంటలపాటు నిరీక్షించారు. చివరికి ఆమె చనిపోయారు. తల్లి చనిపోయిందన్న బాధతో హర్షల్ మెహతా ఫ్యామిలీ ఉన్న సమయంలో.. అదే ఆస్పత్రిలో ఓ కుళ్లిపోయిన శవం కనిపించింది. అదీ మాలతీగా గుర్తించారు. ఆస్పత్రి టాయ్‌లెట్ గదిలో మాలతీ అచేతనంగా కనిపించారు. బుధవారం రోజున టాయ్‌లెట్ క్యుబికల్ ఓపెన్ చేయడంతో మృతదేహం కనిపించింది. కానీ ఆమె అందులో ఎలా పడిపోయారనే అంశంపై మాత్రం తెలియలేదు.
అయితే, ఈ నెల 2వ తేదీన వృద్దురాలు ఆస్పత్రికి వచ్చారని, ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరమని చెప్పామని సిబ్బంది చెబుతున్నారు. కానీ, హాస్పిటల్ లో జాయిన్ కాకుండా వెళ్లిపోయిన మాలతీ మాత్రం టాయ్ లెట్ గదిలో పడిపోయి ఊపిరాడక చనిపోయారు. ఎనిమిది రోజుల నుంచి ఎవరూ తీయలేదు. దీంతో కంపు కొట్టడంతో ఇతర రోగులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ఓపెన్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు స్పందించారు. డీన్ ఖైర్ సహా ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.