పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం గత నెలలో జరిపిన సర్జికల్ దాడుల అనంతరం - పాకిస్తాన్ నిత్యం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ఈ విషయంలో పాక్ చర్యలకు భారత బలగాలు ఎప్పటికప్పుడు దీటైన సమాధానం చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్ లోని హిరానగర్ సెక్టార్ లో శుక్రవారం వాస్తవాధీన రేఖ - అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. అయితే వీటిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) దళాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. ఈ ఘటనకు ముందు రోజే కథువా జిల్లాలో ఆరుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని ప్రయత్నించగా... భారత భద్రతా బలగాలు ఆ చొరబాటును భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి థర్మల్ ఇమేజెస్ ను బీఎస్ ఎఫ్ తాజాగా విడుదల చేసింది.
రాత్రి సమయంలో ప్రత్యేక సాంకేతికతతో తీసిని ఫోటోలివి. బీఎస్ ఎఫ్ ఔట్ పోస్ట్ లపై బాంబులు విసురుతున్న ఉగ్రవాదులు - ఇండియన్ ఆర్మీ వారిపై జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి వారు కిందకు వంగుతూ, సమయం చూసి మరలా దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. కథువా జిల్లా హిరానగర్ సెక్టార్ లో భారత ఔట్ పోస్ట్‌లపై పాకిస్థాన్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్ ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఆ కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు - ఒక ఉగ్రవాది మరణించారని బీఎస్ ఎఫ్ అధికారులు వెల్లడించారు. అయితే ఇదే ప్రాంతంలో అంతకుముందు పాకిస్థాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో బీఎస్ ఎఫ్ కానిస్టేబుల్ గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/