ఎంత దూకుడు రాజకీయాలు నడుస్తున్నప్పటికి పరిధులు.. పరిమితులు అస్సలు మర్చిపోకూడదు. ఆవేశంతో వెనుకా ముందు చూసుకోకుండా రాయలేని భాషను వాడేసి అడ్డంగా బుక్ అయిన యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయా శంకర్ సింగ్ కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. నిన్నటి వరకూ మందీ మార్బలంతో దర్జాగా ఉన్న ఆయన పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. అతగాడి మొరటు వ్యాఖ్యలకు ఆరేళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వేటు వేయగా.. మరోవైపు అంత దారుణ వ్యాఖ్యలు చేసిన నేతను ఊరికే వదిలేయకూడదని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది.
ఇదిలా ఉంటే.. తనను అనకూడని మాట అన్న నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉగ్రరూపం దాల్చారు. తన సత్తా ఏంటో చాటాలన్నట్లుగా ఆమె భారీ ధర్నాకు పిలుపునివ్వటం.. దీనికి తగ్గట్లే పెద్ద ఎత్తున ఆమె అభిమానులు తరలి వచ్చారు. ఈ నిరసనలు యూపీకే పరిమితం కాకుండా దేశ రాజధాని ఢిల్లీకి పాకటం గమనార్హం. ఇదిలా ఉండగా.. మాజీ బీజేపీ నేత దయాశంకర్ నాలుకను కోసి తెచ్చిన వారికి రూ.50లక్షలు ఇవ్వనున్నట్లుగా ఛండీగడ్ నగర బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ ప్రకటించారు. మాట జారిన మాజీ బీజేపీ నేత భారీ మూల్యాన్నే చెల్లించారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం ముగిసిన వివాదంగా వెంకయ్య వ్యాఖ్యానించారు. ఎంత మాట పడితే అంత మాట అన్నోళ్ల మీద వేటు వేసేయటంతోనే వివాదం ముగిసిపోయినట్లా..?