ఉత్తరప్రదేశ్ తాజా ఎన్నికల్లో సమాజ్ వాదీపార్టీ (ఎస్పీ) ఓడిపోయినా మెరుగైన ఫలితాలనే రాబట్టింది. కాకపోతే ఎన్నికల్లో గెలుపోటములకు అంకెలే ముఖ్యంకాబట్టి అంకెలపరంగా చూస్తే ఓడిపోయిందనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2017 ఎన్నికలతో పోల్చితే తాజా ఎన్నికల్లో సుమారు 50 సీట్లు తగ్గిపోయింది. బీజేపీకి సీట్లు తగ్గిపోయి ఎస్పీకి సీట్లు పెరిగినా అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది ?
ఎందుకంటే పెరిగిన సీట్లు అధికారం అందుకునేంతగా పెరగలేదు కాబట్టే. అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఎస్పీని అడ్డుకున్నది బీఎస్పీ, ఎంఐఎం పార్టీలే అని విశ్లేషకుల అంచనా. ఎలాగంటే దళితుల ఓట్లు హోల్ మొత్తంగా ఎస్పీకి పడకుండా బీఎస్పీ అడ్డుకున్నది. రాష్ట్రంలోని మొత్తం దళితుల ఓట్లలో జాతవ్ లు 10 శాతం ఉన్నారు. వీరిలో అత్యధికులు అయితే బీఎస్పీకి లేదా బీజేపీకి వేశారే కానీ ఎస్పీకి మాత్రం వేయలేదు. ఇక్కడే ఎస్పీకి పెద్ద గండిపడింది.
ఇక ఎంఐఎంను తీసుకుంటే పోటీచేసిన 100 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా గెలవలేదు. కానీ చాలా నియోజకవర్గాల్లో 15-20 వేల ఓట్ల మధ్య తెచ్చుకున్నది. ఇదే సమయంలో సుమారు 50 మంది బీఎస్పీ అభ్యర్ధులకు 25 వేల ఓట్లు పడ్డాయట.
బీజేపీ-ఎస్పీ మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సుమారు 80 నియోజకవర్గాల్లో ఎస్పీ అభ్యర్ధులు 10 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అంటే ఎస్పీ అభ్యర్ధులు ఓడిపోయిన నియోజకవర్గాల్లో బీఎస్పీ, ఎంఐఎంలు కూడా పోటీచేశాయి.
ఇక్కడే బీఎస్పీ, ఎంఐఎం నుండి ఎస్పీకి కనీసం 60 నియోజకవర్గాల్లో దెబ్బ పడింది. ఎస్పీ అభ్యర్థుల మీద బీజేపీ అభ్యర్ధులు సాధించిన మెజారిటీ కన్నా ఓడిపోయిన బీఎస్పీ, ఎంఐఎం అభ్యర్ధులకు పడిన ఓట్లు ఎక్కువ.
ఎన్నికల్లో ప్రత్యర్ధులను గెలవటానికి ప్రతి పార్టీ తనదైన మాయాజాలాన్ని ప్రదర్శించటం సహజమే. బహుశా యూపీ ఎన్నికల్లో గెలుపుకు బీఎస్పీ, ఎంఐఎంలను బీజేపీ ప్రయోగించిందేమో. ఎందుకంటే బీఎస్పీ, ఎంఐఎంలు బీజేపీ గెలుపుకోసమే పనిచేస్తున్నాయనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నదే.