ఇంజినీరింగ్ చదవాలంటే ఎంసెట్ రాయాలి.. ర్యాంక్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత కాలేజీలో చేరాలి. మళ్లీ పరీక్షలు రాయాలి. పాస్ అయితే మన చేతికి సర్టిఫికెట్ వస్తుంది. ఇంత తతంగం ఉంటుంది. కానీ ఇదేమీ అవసరం లేకుండానే కేవలం రూ. 3 లక్షలు ఇస్తే .. కొన్ని కాలేజీలు బీటెక్ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా సాగుతున్నది. ఓ రాజకీయ నాయకుడికి చెందిన అటానమస్ కళాశాలలో ఈ సర్టిఫికెట్ల వ్యాపారం సాగుతున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.యూజీసీ నుంచి అటానమస్ (స్వయం ప్రతిపత్తి) పొందిన కళాశాలలు సొంతంగానే పరీక్షలు నిర్వహించుకోవచ్చు.
జేఎన్టీయూహెచ్ పరిధిలో మొత్తం 35 ఇంజినీరింగ్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి ఉంది. ఇక్కడ ఫలితాలు విడుదల చేసినప్పుడు మాత్రం జేఎన్యూహెచ్ నుంచి ఓ అధికారి వెళ్తారు. అయితే విద్యార్థులకు సంబంధించిన జాబితాను సంబంధిత కళాశాల జేఎన్టీయూహెచ్కు పంపిస్తుంది. దీంతో వాళ్లు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అయితే ఇదే అదనుగా చేసుకున్న కళాశాల యాజమాన్యం .. రూ. 3 లక్షలు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. గతంలో కళాశాలలో ఒకటి రెండేళ్లు చదివి మానేసిన విద్యార్థుల వివరాలను మార్చి ఈ విధంగా అక్రమ దందాకు తెరలేపారు. అయితే ఇటీవల ఈ విషయంపై జేఎన్టీయూహెచ్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు.
ఈ విషయంపై ఇటీవల జేఎన్టీయూహెచ్కు చెందిన ఓ అధికారికి ఫిర్యాదు అందింది. దీంతో అతడు ఉన్నతాధికారులు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉందని జేఎన్టీయూహెచ్ అధికారులు అంటున్నారు. దీంతో ఇక నుంచి బీటెక్ అడ్మిషన్లు మొదలైన వెంబడే వివరాలు తెలుసుకోవాలని భావించామని వాళ్లు అంటున్నారు.
అయితే సదరు కళాశాలలో ఇటువంటి అనేక అక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో కొన్ని కళాశాలల్లో సెమిస్టర్ ప్రశ్నాపత్రాలను కూడా ముందుగానే లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అప్పట్లో జేఎన్టీయూహెచ్కు ఫిర్యాదు అందినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు హాజరుశాతం లేకపోయినా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ.. పరీక్షలకు అనుమతిస్తున్నట్టు సమాచారం. యూజీసీ అనుమతి ఉన్న కొన్ని కళాశాలలు బీటెక్ సర్టిఫికెట్లను అమ్మేస్తూ అక్రమాలకు పాల్పడతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.