టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు

Update: 2015-09-12 06:27 GMT
కారు ప్ర‌మాదంలో టీడీపీ ఎమ్మెల్యే కు తీవ్ర గాయాల‌య్యాయి. తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మ‌డివ‌రం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్సీ చైత‌న్య‌రాజు త‌దిత‌రులంతా క‌లిసి ఐదు రోజుల క్రితం సింగ‌పూర్‌, మ‌లేషియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్క‌డ బుచ్చిబాబు,  చైత‌న్య రాజు ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో ఎమ్మెల్యే బుచ్చిబాబు త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు దెబ్బ‌తింది.

గాయ‌ప‌డిన బుచ్చిబాబును మిగిలిన ఎమ్మెల్యేలు స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో బుచ్చిబాబు త‌ల‌కు 12 కుట్లు ప‌డ్డాయి. బుచ్చిబాబు విదేశాల్లో గాయ‌ప‌డినా.. ఆయ‌న ఇక్క‌డ‌కు ఇండియాకు తిరిగి వ‌చ్చి త‌న‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు చెప్పే వ‌ర‌కు ఈ విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బుచ్చిబాబుకు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిన వెంట‌నే ప‌లువురు ఎమ్మెల్యే లు ఆయ‌న‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది.

ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ఏపీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌తో పాటు అమ‌లాపురం ఎంపీ ర‌వీంద్ర‌బాబు బుచ్చిబాబుకు ఫోన్ చేసి ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది.
Tags:    

Similar News