రాజకీయ నేతలు పార్టీలు మార్చినప్పుడు ఎన్నో మార్పులు చేసుకోవాలి. ఇల్లు, ఆఫీసు వద్ద పార్టీ జెండాలుంటే మార్చుకోవాలి.. వాహనాలకు ఆయా పార్టీలకు సంబంధించిన రంగులుంటే మార్చుకోవాలి. ఇలా చాలాచాలా మార్పులు చేసుకోవాలి. మారుతున్న టెక్నాలజీ యుగంలో ఫిరాయింపుదారులకు మరికొన్ని మార్పులూ తప్పనిసరవుతున్నాయి. ముఖ్యంగా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పార్టీ రంగులను, గుర్తులను మార్చడంతో పాటు అంతకుముందు చేసి పార్టీ ఈవెంట్ల వ్యవహారాలను తీసేయాల్సిందే. చాలామంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు వెంటనే ఆ పనిచేయలేకపోతున్నారు. కానీ... తాజాగా టీడీపీలో చేరిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాత్రం ఈ విషయంలో బాగా అలర్టుగా ఉణ్నారు.
ఆయన టీడీపీలో చేరడానికి ముందే తన ఫేస్ బుక్ ప్రొఫైల్ ను మార్చేశారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బుడ్డా... పార్టీ మారడానికి ఒక రోజు ముందే ఈ తంతంతా పూర్తి చేశారు. మొన్నటిదాకా ఫేస్ బుక్ లో వైసీపీ నేతగా కనిపించిన ఆయన... నిన్న ఉన్నట్టుండి టీడీపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఫేస్ బుక్ లోని తన హోం పేజీలో తన ఫోటో వెనుక ఉన్న వైసీపీ రంగును తీసేసి పసుపు రంగు బ్యాక్ గ్రౌండ్ పెట్టారు. బుడ్డా రాజశేఖరరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అని ఉందిప్పుడు.
అంతేకాదు.. తన ఫేస్ బుక్ పేజీలో ఎక్కడా వైసీపీ వాసన లేకుండా బుడ్డా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకప్పుడు టీడీపీ నుంచే వైసీపీలోకి వచ్చిన ఆయన మళ్లీ టీడీపీ గూటికే చేరడంతో అక్కడ పూర్తిగా ఇమిడిపోవడానికి వీలుగా మొత్తం అన్ని విధాలుగా మార్పులు చేస్తున్నారాయన. సోషల్ మీడియాలోనూ మార్పుచేర్పులు చేయడంతో మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా ఆయన్ను చూసి చాలా నేర్చుకుంటున్నారట.