ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గత నాలుగేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో ? అన్న సందేహాలు ఉన్న నేతలు మాత్రం తమ దారి తాము చూసుకుంటున్నారు. ఏ దారి లేని వాళ్ళు మాత్రం పార్టీలోనే ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. ఒకప్పుడు అంతర్గత క్రమశిక్షణకు కేరాఫ్ అయిన టిడిపిలో ఇప్పుడు అదే క్రమశిక్షణ పూర్తిగా కంట్రోల్ తప్పేసింది.
చివరకు చంద్రబాబు సైతం నేతలను అదుపుచేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియా పోస్టులతో చంద్రబాబుకు తలనొప్పిగా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఈ రోజు పెట్టిన పోస్ట్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు... యువనేత లోకేష్ ను టార్గెట్ గా చేసుకున్నట్లు ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఈ పోస్టు టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇదిలా ఉంటే కేశినేని సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారో లేదో వెంటనే వెంకన్న నుంచి కౌంటర్ వచ్చేసింది.
‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం...నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు..చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు నాని వెంకన్నను టార్గెట్ గా చేసుకుని పెట్టిన పోస్టులో నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు - నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అందులోనే నాలుగు పదాలు చదవలేని వాడు - నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు... ఇది మన దౌర్భాగ్యం అని కూడా విమర్శించారు.
ఏదేమైనా వీరిద్దరు ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకోవడాన్ని బట్టి చూస్తే విజయవాడ టీడీపీలో పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పేసిందని అర్థమవుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పట్టు కోసం అటు బుద్ధా - ఇటు నాని ఇద్దరూ చేస్తోన్న ప్రయత్నంలో భాగంగానే జరుగుతోన్న ప్రచ్ఛన్నయుద్ధంలో ఇది ఓ భాగం మాత్రమే అని బెజవాడ టీడీపీ టాక్. ఇది ఫ్యూచర్‌లో మరింతగా ముదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకుంటారా ? లేదా ? అన్నది చూడాలి.