జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తిట్టాలనుకున్నప్పుడు.. ఆయన సినిమా డైలాగుల్ని కాస్త స్టడీ చేస్తే బాగుంటుందేమో. తాజాగా ఆ పని చేయని తెలుగుతమ్ముడు అడ్డంగా బుక్ అయిన వైనమిది. పవన్ సినిమాల్లో ఫేమస్ డైలాగుల్లో ఒకటి.. నాకు కాస్త తిక్కుంది. కానీ.. దానికో లెక్కుందంటూ చెప్పిన డైలాగును పదే పదే ప్రస్తావిస్తుంటారు. అందరికి ఆవేశం ఉంటుంది. కానీ.. దానికి ఒక ఆలోచన అవసరం.
ఆవేశం మాత్రమే ఉండి.. ఆలోచన మిస్ అయితే.. తాజాగా టీడీపీ నేత.. ఏపీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న మాట మాదిరి మారుతుందని చెప్పాలి. తాజాగా ఆయన చేసిన సంచలన సవాలు మిస్ ఫైర్ కావటమే కాదు.. తెలుగు తమ్ముళ్లు ఆత్మరక్షణలో పడేలా చేసిందని చెప్పాలి. పవన్ ను ఏదోలా తిట్టి అధినేత కంట్లో పడాలనుకున్న తొందరలో ఆయన లాజిక్ మిస్ అయి.. అడ్డంగా బుక్ అయ్యారని చెప్పాలి.
ఇంతకీ ఆయన అన్న మాటేమిటంటే.. పవన్ మాట్లాడే ప్రతిసారీ 2014 ఎన్నికల్లో బాబు గెలుపులో తనదే కీలకభూమికగా గొప్పలు చెప్పుకుంటారని.. అలాంటి పవన్ 2019 ఎన్నికల్లో బీజేపీ మద్దుతుగా ప్రచారం చేసి గెలిపించే దమ్ముందా? అంటూ ప్రశ్నించారు. బుద్దా మాట విన్నంతనే తప్పు కనిపించదు. కానీ.. కాస్తంత లోతుగా ఆయన వ్యాఖ్యను చూస్తే.. అందులో డొల్లతనం కనిపించటమే కాదు.. మెగా తమ్ముడికి తెలుగు తమ్ముళ్లు ఎంతలా భయపడుతున్నారో ఇట్టే అర్థం కాక మానదు.
ఏపీలో ఈ రోజు బీజేపీ అన్నంతనే ఆంధ్రోళ్లు ఎంతలా ఫైర్ అవుతారో తెలిసిందే. అలాంటి పార్టీకి పవన్ మద్దతు ఇవ్వాలని కోరటం అంటే.. పవన్ బలాన్ని బుద్దా ఎక్కువన్న మాటను చెప్పకనే చెప్పినట్లు అయ్యే పరిస్థితి. బీజేపీకి మద్దతు ఇస్తే.. హోదా విషయంలో మోడీ అండ్ కో అనుసరించిన వైనంపై ఆగ్రహంగా ఉన్న వారు.. ఆ పార్టీని చిత్తుగా ఓడించే పరిస్థితి. అలాంటి పార్టీకి మద్దుతుగా పవన్ ను నిలవమని చెప్పటం అంటే.. ఆయనకున్న బలాన్ని బీజేపీ బూచిని చూపించి తగ్గించాలనే కదా? అన్న క్వశ్చన్ రాక మానదు. పవన్ ఒంటరిగా వస్తే ఎక్కడ తమ కూసాలు కదిలిపోతాయన్న భయంతోనే బుద్దా ఇలాంటి బుద్ధి తక్కువ సవాల్ విసిరారంటూ తమ్ముళ్లు కొందరు తల పట్టుకోవటం గమనార్హం.