మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ హత్యలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా.. ఈ హత్య కేసు వెనుక.. వివేకా అన్న కుమారుడు, సీఎం జగన్ ఉన్నారని.. షాకింగ్ కామెంట్లు చేసింది.
ఈ మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసును పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసు విచారణ చేస్తున్న సీబీఐపైనే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎంత దుర్మార్గుడో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు.
ఎంపీ నోరు ఏమైంది?
వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఆయనకు గుండె పోటు వచ్చిందని ప్రచారం చేసిన కడప ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డి ఏమయ్యారని.. ఎక్కడ దాక్కునన్నారని బుద్దా ప్రశ్నించారు. అంతేకాదు.. ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
పార్టీ నుంచి ఆయనను ఎందుకు జగన్ సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని.. అన్నారు. వివేకా కుమార్తె సునీతను, ఆమె భర్తను ఈ కేసులో ఇరికించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు దొంగలను జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సునీతకు రక్షణ కల్పించాలి!
వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లోనే ఉందని.. ఆమె కుటుంబానికి ప్రాణ గండం ఉందని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ నేపథ్యంలో సునీత కుటుంబానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రక్షణ కల్పించాలని కోరారు.
ఆమె ప్రాణాలకు కానీ, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు కానీ.. ఏమైనా హాని జరిగితే.. దానికి జగన్, వైసీపీ నాయకులు బాధ్యత వహించాలని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. దీనిపై తాము మాట్లాడితే మాపై కూడా కేసుల పెట్టొచ్చని , దాడులు కూడా చేయొచ్చని ఆరోపించారు. వైసీపీ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
టీడీపీకి సునీతకు సంబంధం లేదు!
వైఎస్ సునీతను పులివెందుల అభ్యర్థిగా టీడీపీ బరిలోకి దించబోతుందని వైసీపీ నేతల ఆరోపణలకు బుద్దా వెంకన్న తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని ఇప్పటికే తమ పార్టీ అధినేత చంద్రబాబు స్ఫష్టంగా చెప్పారని తెలిపారు. సునీత ఎందుకు పోటీ చేస్తుందని చురకలు అంటించారు. సునీత వెనుక టీడీపీ లేదని . కావాలనే ఆమెపై వైసీపీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు వదిలించుకుందామా.. అని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు.
ఇక, వైసీపీ ఎమ్మెల్యే రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని .. ఆమె మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రోజా మాటలకు విలువలేదని వెంకన్న మండిపడ్డారు.