ఈసారి బ‌డ్జెట్ సో స్పెష‌ల్‌.. ఆ ప‌న్నులే ఉండ‌వ‌ట‌

Update: 2018-01-29 05:20 GMT
మ‌రికొద్ది రోజుల్లో 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా ఎప్పుడూ లేని రీతిలో ఒక విశేషం చోటు  చేసుకోనుంది. ప‌రోక్ష ప‌న్నుల ప్ర‌స్తావ‌న లేని తొలి బ‌డ్జెట్ గా దీన్ని అభివ‌ర్ణిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఎలా సాధ్య‌మైందంటే.. ఇదంతా జీఎస్టీ పుణ్య‌మేన‌ని చెబుతున్నారు.

వ‌స్తు సేవ‌ల ప‌న్ను విధానం (జీఎస్టీ) అమ‌ల్లోకి రావ‌టంతో సంప్ర‌దాయంగా ఉండే ప‌రోక్ష ప‌న్నులైన క‌స్ట‌మ్స్ డ్యూటీ.. ఎక్సైజ్ డ్యూటీతో పాటు సేవాప‌న్ను.. వ్యాట్ లాంటివి ఉంటాయి. అయితే.. ఇప్పుడు అలాంటి అవ‌స‌రం లేని సంగ‌తి తెలిసిందే. ప‌న్నుల‌న్నింటికి ఒక మూటన క‌ట్టేసి జీఎస్టీలోకి మార్చేసిన నేప‌థ్యంలో ఇప్పుడిక అలాంటి ప‌న్ను ప్ర‌స్తావ‌న రాని ప‌రిస్థితి.

దాదాపుగా 12 ర‌కాల ప‌రోక్ష ప‌న్నులు.. సెస్సుల‌ను విలీనం చేసి జీఎస్టీ కింద ఒకే ప‌న్నుగా రూపొందించారు. ఇక‌.. ప్ర‌త్య‌క్ష ప‌న్నులైన ఆదాయ‌పు ప‌న్ను.. కార్పొరేట్ ప‌న్నుల విధింపు..కొత్త వివ‌రాలే ఉండ‌నున్నాయి. ఈ కార‌ణాల‌తో బ‌డ్జెట్ ప్ర‌సంగ స‌మ‌యం కూడా త‌గ్గే వీలుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. మోడీ స‌ర్కారుకు ఈసారి ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ చివ‌రిది కావ‌టంతో ప్ర‌జాక‌ర్ష‌క విధ‌నాల‌కు పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే వీల్లేదు. దీంతో.. ఈసారి ప్ర‌వేశపెట్టే బ‌డ్జెట్ లో వీలైనంత‌గా ప్ర‌జాక‌ర్ష‌ణ నిర్ణ‌యాలు ఉండేలా చూస్తార‌ని భావిస్తున్నారు. ఎంత ఎన్నిక‌లైతే మాత్రం.. మిగిలిన బ‌డ్జెట్ ల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే.. సంప్ర‌దాయ రాజ‌కీయ పార్టీల మాదిరే ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టేట‌ట్లు మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ వ‌చ్చే వీలుంది. ఈ నేప‌థ్యంలో బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతున్నంత భారీగా ప్రజాక‌ర్ష‌క విధానాల్ని వెల్ల‌డించే అవ‌కాశం ఉండ‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మిగిలిన వాటి సంగ‌తి ఎలా ఉన్నా ఆదాయ ప‌న్ను ప‌రిమితిపై మాత్రం మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌ల్లో ఉన్న రూ.2.5ల‌క్ష‌ల మిన‌హాయింపును మోడీ స‌ర్కారు రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కూ పెంచే వీలుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. మోడీ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News