పేపరో.. పేపర్ లెస్సో కానీ.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీకి అదిరిపోయే గిప్టు అందింది. బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో సభ్యులకు ఇవ్వాల్సిన బడ్జెట్ ప్రతులకు భిన్నంగా ఖరీదైన ఐప్యాడ్ లను చేతిలో పెట్టారు. ఊహించని విధంగా వచ్చిన ఈ ఫ్రీ గిప్టుతో ఖుషీ అయ్యారు. ఇంతకీ ఖరీదైన ఐప్యాడ్ తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఎందుకు ఇచ్చినట్లు? అంటే.. దానికో కారణం ఉందని చెబుతున్నారు.
ఇకపై తెలంగాణ అసెంబ్లీని పేపర్ లెస్ అసెంబ్లీగా మార్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా.. బడ్జెట్ పుస్తకాల్ని అందించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా.. ఖరీదైన ఐప్యాడ్ లను అందించారు. అందులోనే.. బడ్జెట్ ప్రతుల్ని అప్ లోడ్ చేసి ఇచ్చారు. ఇకపై సమస్త సమాచారం ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తామని చెప్పారు.
అధికారిక సమాచారం మొదలు.. ఉత్తర ప్రత్యుత్తరాల వరకు అన్నింటిని ఆన్ లైన్ లోనే చక్కబెట్టాలని అందుకు అవసరమైన ఐప్యాడ్ ను అందుకే ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా 96 నిమిషాల సుదీర్ఘ ప్రసంగాన్ని చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ కొత్త రికార్డును క్రియేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు సాగిన బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనదిగా చెబుతున్నారు. మొత్తం బడ్జెట్ ప్రసంగానికి సంబంధించిన ప్రతిని.. ఐప్యాడ్ లో అప్ లోడ్ చేయటంతో.. దాన్ని చూస్తూ బడ్జెట్ స్పీచ్ నుసభ్యులు ఫాలో కావటం కనిపించింది.