బాబు పాలన గురించి తెలుగు తమ్ముళ్లు గొప్పలు చెప్పుకోవటం మామూలే. తానేం చేసినా.. ప్రపంచంలో మరెవరూ చేయనట్లుగా గొప్పగా చెప్పుకోవటం ఏపీ ముఖ్యమంత్రికి అలవాటే. తాజాగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తున్న వైనాన్ని గొప్పగా చెప్పటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించటం అంటే.. బ్యాంకుల నుంచి రుణం రాకనేనా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం బాండ్ల జారీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ల జారీ అంటే అప్పు చేయటమే తప్పించి మరొకటి కాదన్న ఆయన.. అమరావతి బాండ్ల విషయంలో ఏపీ సర్కారు చేస్తున్న ప్రచారాన్ని తప్పు పట్టారు.
టీడీపీ అధినేత చేసే ప్రతి పనిలోనూ మతలబు ఉంటుందని చెప్పిన బుగ్గన.. తాజాగా విలేకరులతో మాట్లాడారు. మరెక్కడా లేని విధంగా అమరావతి బాండ్లకు 10.75 శాతం వడ్డీ చెల్లించటాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 194 బాండ్లు జారీ చేసి ఉన్నాయని.. అందులో నాలుగు బాండ్లకు మాత్రమే 10 శాతం వడ్డీ అని.. మిగిలిన బాండ్లన్ని అంతకంటే తక్కువ వడ్డీగా చెప్పారు. ఒక్క అమరావతి బాండ్లకు మాత్రమే పది శాతానికి మించిన వడ్డీ అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనే బాండ్లు జారీ చేయాలని.. బాండ్ల పేరుతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. అమరావతి బాండ్లలో ఆ తొమ్మిది మంది ఇన్వెస్టర్స్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ కు కాంట్రాక్టు ఇస్తున్న ప్రభుత్వం అక్కడ తక్కువ వడ్డీకి అప్పు వస్తున్నా? ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
2014 నాటికి ఏపీకి రూ.95 వేల కోట్ల అప్పు ఉండేదని.. 2018 నాటికి రూ.2.50లక్షల కోట్లకు అప్పులు పెరిగిన విషయాన్ని వెల్లడించారు. ఏపీలోనిప్రతి కుటుంబంపైనా రూ.1.5లక్షల అప్పు ఉందని చెప్పారు. సీఆర్డీ పరిదిలో రూ.829 కోట్ల పనులు మాత్రమే జరుగుతుంటే.. వేలాది కోట్ల రూపాయిల పనులు జరుగుతున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పు పట్టారు.