టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించాలన్నంతనే ఏపీ అధికారపక్షానికి వచ్చే జోష్ అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకూ బాబుపై ఒంటికాలిపై విరుచుకు పడుతుంటారు. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ కు వెళ్లిన చంద్రబాబు.. అక్కడే ఉండిపోవటం.. ఏపీకి వస్తే క్వారంటైన్ లో ఉండాల్సి రావటంతో భాగ్యనగరిలోనే ఉండిపోయిన సంగతి తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న బాబు తీరును వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు. హైదరాబాద్ లో ఉండి రాజకీయాలు చేయటమా? మరంత ధైర్యం ఉంటే ఏపీకి ఎందుకు రావటం లేదన్న మాట జగన్ పార్టీ నేతల నోటి నుంచి వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి డి నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కానీ పవర్లో ఉండి ఉంటే.. మీడియాలో ఆయన మీద ఎలాంటి వార్తలు వచ్చేవో తెలుసా? అని ప్రశ్నిస్తూ.. తానే సమాధానాన్ని చెప్పేశారు. కరోనా పై కత్తి యుద్దం.. అర్థరాత్రి ఒంటి గంట వరకూ బాబు సమీక్ష.. ఐరాసలో కరోనా పై బాబు ప్రజెంటేషన్.. పారిశుద్ధ్య కార్మికులు.. అధికారులపై ఆగ్రహం.. కరోనాను బాబు జయించారన్న వార్తల్ని ప్రచారం చేసుకునే వారన్నారు.మొత్తంగా తనదైన రీతిలో బాబును ఎటకారం చేసుకున్నారు బుగ్గన.