బాబు చేసిన త‌ప్పును చేయ‌ని జ‌గ‌న్‌!

Update: 2019-07-12 10:06 GMT
గొప్ప‌లు చెప్పుకోవ‌టం పెద్ద విష‌య‌మే కాదు. సందు చివ‌రి సుబ్బారావు మొద‌లు అంద‌రూ చెప్పేటోళ్లే. కానీ.. ప్ర‌జ‌లు ఇచ్చిన బాధ్య‌త‌ను నిత్యం స్మ‌రించుకుంటూ త‌ప్పులు చేయ‌కుండా.. ఇచ్చిన మాట‌ను త‌ప్పుకుండా ఉండాల‌ని త‌హ‌త‌హ‌లాడే వారు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తుంటారు. తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని చూస్తే ఇదే విష‌యం అర్థం కాక మాన‌దు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌రింత మైలేజ్ కోసం పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో గొప్ప‌లు చెప్పుకోవ‌చ్చు. ఇంకేముంది? వ‌చ్చే ఏడాది మొద‌ట్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామ‌ని చెప్పొచ్చు. కానీ.. అలాంటిదేమీ లేకుండా చాలా ప్రాక్టికల్ గా వ్య‌వ‌హ‌రిస్తూ.. పోల‌వ‌రం ప్రాజెక్టుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా ఇచ్చిన క్లారిటీ చూస్తే.. జ‌గ‌న్ ఆలోచ‌న ఇట్టే అర్థం కాక మాన‌దు.

బాబు మాదిరి పోల‌వ‌రం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేస్తాం. ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రం డే.. ఆ రోజు ప‌నుల‌ను స‌మీక్షించి.. ప‌రుగులు పెట్టించి ఆర్నెల్ల‌లో పూర్తి చేస్తామ‌న్న బ‌డాయి మాట‌ల‌కు పోని వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క‌మాన‌దు. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న పోల‌వ‌రం ప్రాజెక్టు మీద కాస్తంత క్లారిటీ ఇచ్చారు.

ఈ భారీ ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు. కృష్ణా-గోదావ‌రి ఆయుక‌ట్ట‌ల‌ను స్థిరీక‌రించ‌టం.. రాయ‌ల‌సీమ‌.. ఉత్త‌రాంధ్ర‌ల‌ను హ‌రితాంధ్ర ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ద‌టం వైఎస్ దార్శ‌నిక‌త అని.. ఆయ‌న క‌ల‌ను సాకారం చేయ‌టం కోసం తాము పోల‌వ‌రం ప్రాజెక్టును 2021 జూన్ నాటిని పూర్తి చేస్తామ‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. చెప్పిన మాట‌ల‌కు త‌గ్గట్లే బ‌డ్జెట్ లో కేటాయింపులు జ‌రిపి పూర్తి చేసేలా కృషి చేస్తామ‌న్నారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో ప్రాజెక్టు ప్ర‌భావిత కేటాయింపు పునఃప‌రిష్కారం .. పున‌రావాసం క‌ల్పించ‌టానికి అన్ని చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. బడ్జెట్ ప్ర‌సంగంలో పోల‌వ‌రం మీద బుగ్గ‌న మాట‌లు వింటే..బ‌డాయి మాట‌ల కంటే ప్రాక్టిక‌ల్ గా ఉండాల‌న్న ఆలోచ‌న నిండుగా ఉన్న‌ట్లు అనిపించ‌క మాన‌దు. పోల‌వ‌రంపై జ‌గ‌న్ స‌ర్కారు తీరు చూస్తే.. బాబు మాదిరి కాకుండా ప్రాక్టిక‌ల్ గా ఉండ‌ట‌మే మంచిద‌న్న ధోర‌ణిలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.



Tags:    

Similar News