వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అనే పాయింట్ మీదే అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతూ ఉన్నాయి. జగన్ కేబినెట్లో మంత్రులు ఎవరు? అనే అంశం గురించి అయితే ఊహాగానాలు జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. జగన్ కేబినెట్లో మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు? అనే అంశం మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి.
అందులో భాగంగా తాజాగా బెర్తుల మీద కూడా అంచనాలు, అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. జగన్ కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉంటారనే అంశంతో మొదలుపెట్టి.. ఇప్పుడు వారిలో ఎవరికి ఏ బెర్త్ దక్కుతుందనే టాక్ కూడా మొదలైంది.
అందులో భాగంగా కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పదవి కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దక్కనుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మేరకు ఊహాగానాలు చెలరేగుతూ ఉన్నాయి.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జగన్ కు బాగా సన్నిహితుడు. అలాగే పీఏసీ చైర్మన్ గా వ్యవహరించారు. ఇక శాసనసభలో రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగాలు కూడా ఆసక్తిదాయకంగా సాగాయి. తెలుగుదేశం పార్టీ కి కౌంటర్లు ఇవ్వడంలో చతురోక్తులతో కూడిన ప్రసంగాలు చేశారాయన.
ఇలా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు బుగ్గన. ఆర్థిక అంశాల మీద కూడా అవగాహన కలిగిన వారు, పీఏసీ చైర్మన్ గా అనుభవం ఉంది. ఈ క్రమంలో బుగ్గనకు జగన్ ఆర్థిక శాఖ మంత్రి పదవిని అప్పగిస్తారనే ప్రచారం సాగుతూ ఉంది.
ఇంకా ఎన్నికల ఫలితాలు అయితే రాలేదు కానీ.. మొత్తానికి ఇలాంటి ఆసక్తిదాయకమైన చర్చలైతే కొనసాగుతూ ఉన్నాయి!