పెళ్లి ప్రపోజల్ తిరస్కరణ..అక్కాచెళ్లెళ్లకు నిప్పు

Update: 2018-02-03 17:03 GMT
మ‌రో మృగాడి ఉదంతం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఉత్త‌రప్రదేశ్‌ లోని బులాంద్‌ షార్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి ప్రపోజల్‌ ను తిరస్కరించినందుకు అక్కాచెళ్లెళ్లకు నిప్పు పెట్టాడు ఓ దుండగుడు. ధకోలి గ్రామానికి చెందిన అకింత్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. బాహ్‌ పూర్ గ్రామానికి చెందిన శీలు అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంకిత్ వేధించేవాడు. ఇటీవలే తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయగా.. శీలు తిరస్కరించింది. దీంతో ఆవేశం పెంచుకున్న అంకిత్.. శీలును హత్య చేశాడు.

అయితే ఈ దుర్మ‌ర్గుడు అక్క‌డితోనే ఆగిపోలేదు. ఈ ఘటన జరిగినప్పుడు శీలు సోదరి శివాని కూడా అక్కడే ఉండటంతో.. ఆమెను కూడా మట్టుబెట్టాడు. ఆ తర్వాత తన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను వారిద్దరిపై పోసి తగులబెట్టాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అంకిత్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News