ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారన్నది ప్రధాని మోదీపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆ మాటలను ఏమాత్రం అంగీకరించనివారు కూడా ఇప్పుడు ‘‘అవును.. నిజమే’’ అనేలా మోదీ మారిపోతున్నారని తాజా ఘటనలు చెప్తున్నాయి. ఆయన స్పందిస్తున్న తీరు - వ్యాఖ్యలు ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్నాయి. ఏ విషయంలో ఎవరూ తనను వ్యతిరేకించరాదన్న రీతిలో మోదీ వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా ఆయన బుల్లెట్ ట్రైన్ విషయంలో చేసిన వ్యాఖ్యలూ మరోసారి దుమారం రేపాయి.
బుల్లెట్ ట్రైన్‌ని వ్యతిరేకిస్తే ఎద్దుల బండి ఎక్కాలన్న ఆయన మాటలపై కాంగ్రెస్ ఒక్కటే కాకుండా మిగతా విపక్షాలకు చెందిన నేతలూ మండిపడుతున్నారు. విమర్శలను స్వీకరించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ఎవరినీ ఏమీ ప్రశ్నించలేదా అంటున్నారు.
మరోవైపు సామాన్యులు కూడా చాలామంది బుల్లెట్ ట్రైన్ అనగానే తమకున్న సందేహాలను బయటపెడుతున్నారు. బ్రిటిష్ వాళ్లు నిర్మించి ఇచ్చిన భారీ రైల్వే నెట్ వర్కునే ఇప్పటికీ ప్రమాదరహితంగా నిర్వహించలేకపోతున్న మన ప్రభుత్వాలు బుల్లెట్ ట్రైన్లను ఎంతవరకు సక్రమంగా నడపగలవన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నిత్యం జరుగుతున్న రైలు ప్రమాదాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అందుకే... బుల్లెట్ ట్రైన్ పై ఇన్ని అనుమానాలు.. మరి, వాటిని తీర్చకుండా ఎద్దుల బండి ఎక్కమంటే ఎలా మోదీజీ... ఇదేనా మీ అభివృద్ధి నమూనా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.