దేశంలో గణనీయంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. నిజాం కాలం నుంచి తనదైన వన్నెతో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. భాగ్యనగరంలో వివిధ ప్రాంత, భాష, మతాలకు చెందిన వారంతా కలిసి ఉంటారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. వాయు, రైలు, రోడ్డు మార్గాల్లో ఈ ప్రయాణాలు జరుగుతుంటాయి. అయితే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ వస్తోంది. సులభమైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారికి కేంద్రం ఓ తీపి కబురునందించింది.
హైదరాబాద్ కు ఎన్నో దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి అన్ని రకాలైన ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. భాగ్యనగరానికి త్వరలో ఓ బుల్లెట్ ట్రైన్ రానుంది. బెంగళూరు టూ హైదరాబాద్ మార్గంలో ఈ బుల్లెట్ ట్రైన్ దూసుకుపోనుంది. ఫలితంగా ఇరు నగరాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ బుల్లెట్ ట్రైన్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా మంచి ఆదాయవనరు కూడా. ఆర్థిక వ్యవస్థలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కేంద్రం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 8 కారిడార్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎనిమిది కారిడార్లో బుల్లెట్ రైలును పట్టాలెక్కిండానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన డీపీఆర్ సహా ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. అయితే వీటితో పాటు మరికొన్ని బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 4 అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయానికి రైల్వే శాఖ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే బెంగళూరు టూ హైదరాబాద్ కు బుల్లెట్ రైలు రాబోతుంది.
ఇటీవల ఎంపిక చేసిన నాలుగు మార్గాలకు సంబంధించిన పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. బెంగళూరు- హైదరాబాద్, పాట్నా-గౌహతి, అమృత్ సర్-పఠాన్ కోట్ జమ్ము, నాగ్ పూర్-వారణాసి మార్గాల్లో ఈ బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయి. హైదరాబాద్ కు త్వరలో బుల్లెట్ రావడం నిజంగా మంచి విషయమే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై హైదరాబాదీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.