ఒక మేయర్ పోస్ట్ గిరి విషయంలో ఆసక్తిదాయకమైన రాజకీయం నడుస్తోందని సమాచారం. ఆ పదవిని సొంతం చేసుకోవడానికి కొంతమంది తమ ఆర్థిక శక్తిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. జగన్ కేబినెట్ లో ఇప్పటికే చిన్న చిన్న అవినీతి కార్యకలాపాలకు కిటికీలు తెరిచిన ఒక మంత్రి ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తూ ఉన్నారని సమాచారం.
ఐదు కోట్ల రూపాయల మేరకు చదివించుకోవడానికి రెడీ అని, తమకు ఆ మేయర్ పదవిని దక్కేలా చేయమంటూ ఒక మహిళ ఆ మంత్రి గారి వద్ద బేరం పెట్టిందట. వాస్తవానికి అది ఆ మంత్రి పరిధిలో లేని అంశం. జడ్పీ చైర్మన్ గా ఎవరుండాలి? అనే అంశాన్ని నిర్ణయించేంత శక్తి, అధికారం ఆ మంత్రికి లేదు కూడా. అయినా ఐదు కోట్ల రూపాయలు అనగానే ఆ మంత్రికి ఆశ పుట్టిందట!
తన చేతగాక పోయినా.. 'చూద్దాం..' అంటూ ఆ మంత్రి ఆ మహిళకు హామీ ఇచ్చాడని సమాచారం. ఆ ఐదు కోట్లు తనుదండుకుని ఆమెను మేయర్ గా చేయాలని ఆ మంత్రి భావిస్తున్నాడట.
అయితే అదే మరో మంత్రి మాత్రం ఆ విషయంలో విముఖతతో ఉన్నాడట. 'అలాంటివి జరగవు..' అని ఆ మంత్రి తేల్చి చెబుతూ ఉన్నారని సమాచారం. వేరే నియోజకవర్గాలకు చెందిన నేతలు ఇలా జోక్యం చేసుకోవడం ఏమిటి? అని కూడా ఆ మంత్రి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది!