యూఏఈకి బంపర్​ ఆఫర్​.. వచ్చే ఐపీఎల్​ కూడా అక్కడే

Update: 2020-09-20 08:50 GMT
యూఏఈ  (యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​) బంపర్​ ఆఫర్​ కొట్టేసింది. ప్రస్తుతం అక్కడ ఐపీఎల్​ జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్​ అక్కడే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నదట. దీంతో పాటు వచ్చే ఏడాది భారత్, ఇంగ్లాండ్​ మధ్య జరిగే సిరీస్​కూడా యూఏఈలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి అన్నిదేశాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో యూఏఈకి మాత్రం కలిసొచ్చింది. ఇండియాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు సగటున లక్ష కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనవరి వరకు ఇండియా కరోనా రహిత దేశం కావడం అసాధ్యం. వ్యాక్సిన్​ ట్రయల్స్​ కొనసాగుతున్నప్పటికీ... అవి ఉత్పత్తి అయ్యి పంపిణీ జరిగేవరకు చాలా టైం పడుతుంది.

ఈ నేపథ్యంలో 2021 జనవరిలో నిర్వహించాలనుకున్న ఇండియా-ఇంగ్లాండ్​ టోర్నీని యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ వ్యాక్సిన్​ తొందరగా అందుబాటులోకి వస్తే ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించే అవకాశం ఉన్నది. ఈ ఏడాది ఐపీఎల్ వరకు మాత్రమే అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ తెలిపారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ 2021, వచ్చే ఏడాది ఐపిఎల్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగనున్నట్టు టాక్​.  శనివారం  యూఏఈ క్రికెట్ బోర్డుతో  బీసీసీఐ చైర్మన్, కార్యదర్శి, కోశాధికారి సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు.
Tags:    

Similar News