ఐపీఎల్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మెరుపు బంతులతో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 100 వికెట్లు తీసి రికార్డును సొంతం చేసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అవుట్ చేసి వందో వికెట్ తీశాడు. అయితే బుమ్రా ఐపీఎల్‌లో తీసిన మొదటి వికెట్ కూడా కోహ్లీదే కావడం గమనార్హం. అంతేకాకుండా టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత పేస్ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 20 వికెట్లు పడగొట్టాడు.
తన కెరీర్‌లో 8వ ఐపీఎల్ ఆడుతున్న అతడు 20 వికెట్ల ఫీట్ సాధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 89 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఇప్పటివరకు 102 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం 15వ స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మెంటార్ లసిత్ మలింగ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా బుమ్రాను ఫ్రాంచైజీతో పాటు క్రీడాభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు.
ఏప్రిల్ 4, 2013న బెంగళూరు చినస్వామి మైదానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్. విరాట్ కోహ్లి అప్పటికే మంచి బ్యాట్స్‌మన్‌గా పేరు సంపాదించాడు. గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల యువ బౌలర్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ బరిలోకి దింపింది. తన మొదటి ఓవర్‌ను కోహ్లికి వేయాల్సి వచ్చింది. వరుసగా మూడు బౌండరీలతో కొత్త బౌలర్‌కు కోహ్లి స్వాగతం పలికాడు. దీంతో బుమ్రా కొంచెం ఒత్తిడికి లోనయి తర్వాతి బంతిని వైడ్ వేశాడు. దాన్ని అందుకునే క్రమంలో కోహ్లి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో బుమ్రాకు ఇదే తొలి వికెట్. ఏడేళ్ల తర్వాత వందో వికెట్‌గా కోహ్లిని బుమ్రా ఔట్ చేయడం విశేషం.