టీ20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాల క్రికెట్ జట్లు బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంటే టీమిండియా మాత్రం రొజుకొకరు గాయాలతో ఎగ్జిట్ అవుతుంటే కుదేలవుతోంది. ఇప్పటికే ఆసియాకప్ లో ఘోర ఓటమి మూటగట్టుకున్న టీమిండియా బుమ్రా, హర్షల్ రాకతో ఆస్ల్రేలియాను ఓడించగలిగింది. ఇప్పుడు భారత ప్రధాన బౌలర్,యార్కర్ కింగ్ బుమ్రా వెన్నునొప్పితో టీ20 కప్ నుంచి వైదొలగబోతున్నాడని తెలిసి ఇక టీమిండియా కప్ కొట్టడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది.
ఆసియాకప్ లో ఓటమికి ప్రధాన కారణం.. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇవ్వడం.. భువనేశ్వర్ 19వ ఓవర్ లో భారీగా పరుగులు ఇవ్వడం వల్లే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడి ఆసియాకప్ నుంచి నిష్క్రమించాం.
ఇప్పుడు బుమ్రా వచ్చాడు కష్టాలు తీరాయని అనుకుంటూ ఊహించని ఎదురుదెబ్బ. వెన్నుముకలో ఫ్యాక్చర్ వల్ల అతడు సౌతాఫ్రికాతో సిరీస్ కు దూరమయ్యాడు. దీంతోపాటు టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడని అంటున్నారు. స్టార్ పేసర్ లేకపోవడం ఖచ్చితంగా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
ఇప్పటికే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా మోకాలి గాయంతో దూరమై ఆపరేషన్ చేయించుకున్నాడు. అతడి లోటు వల్లే టీమిండియా ఆసియాకప్ లో ఓడింది. ఇప్పుడు బుమ్రా కూడా వైదొలిగితే టీమిండియా బౌలింగ్ విభాగం కుదేలవ్వడం ఖాయం. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా లేకపోవడం ఖచ్చితంగా టీమ్ కు పెద్ద నష్టంలా చెప్పొచ్చు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీంలో లేడంటే అతిశయోక్తి కాదు.
ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ జట్టు మీద.. అక్కడి టోర్నమెంట్లలో నిలకడగా రాణించేవాడు. అలాంటి బుమ్రా రిప్లేస్ మెంట్ కష్టమేనంటున్నారు. షమీ లేదా సిరాజ్ తో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయవచ్చు. అయితే జట్టులో ఇప్పటికే అర్షదీప్, దీపక్ చాహర్ ఉన్నారు. బుమ్రా స్థానంలో వీరినే కొనసాగించే అవకాశం ఉంది.
బుమ్రానే కాదు టీమిండియాలో చాలామంది గాయాలతో ఉన్నారని మేనేజ్ మెంట్ చెబుతోంది. కానీ బయటపడకుండా కవర్ చేస్తున్నారని.. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఫిట్ గా లేదని అంటున్నారు. ఇలాంటి జట్టుతో కప్ కొట్టడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.