తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ తో ప్రత్యేక దోస్తీ కట్టేందుకు ఆసక్తి కనబరుస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆదాయ వనరులను పెంచుకునే పేరుతో కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని మండిపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్ టీసీ)కి చెందిన ప్రధాన కార్యాలయమైన “బస్ భవన్”నే అద్దెకివ్వనుండటం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటుపై ఉన్న ప్రేమకు నిదర్శనమని ఎద్దేవా చేస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బస్ భవన్‌లో కొంత భాగం కార్పొరేట్ సంస్థ రిలయన్స్ కు సంస్థ కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ సంస్థ ప్రతినిధులు బస్ భవన్‌ను సందర్శించినట్లు సమాచారం. ఇందులో ఎ బ్లాక్ ను అద్దెకు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఆర్ టీసీ క్రాస్ రోడ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌టీసీ ప్రధాన కార్యాలయం కోసం 4 అంతస్థులతో ఎ - బి బ్లాక్ లతో ఆధునాతన పద్దతిలో విశాలమైన భవనం నిర్మించారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీఎస్ ఆర్ టిసి కార్యాలయాలు విజయవాడకు తరలిపోయి వారికి కేటాయించిన ఎ బ్లాక్ దాదాపు ఖాళీ అయింది. నాలుగు అంతస్థులు ఉన్న ఎ బ్లాక్ లో ప్రస్తుతం టీఎస్ ఆర్ టీసీ ఛైర్మన్ చాంబర్ తో పాటు ఏపికి చెందిన పిఎఫ్ - ఎస్ ఆర్ బిఎస్ లాంటి ఒకటి రెండు విభాగాలు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్న బస్ భవన్ విలువలో వాటాను నగదు రూపంలో ఏపీకి ముట్టజెప్పి మొత్తం భవనాన్ని సొంతం చేసుకోవాలని టీఎస్ ఆర్ టీసీ భావిస్తోంది. అనంతరం ఎ బ్లాక్ మొత్తాన్ని కార్పోరేట్ సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆర్‌టిసి అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రిలయన్స్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తోంది.
ఆర్టీసీ భవన్ ను సందర్శించిన రిలయన్స్ ప్రతినిధులు భవనానికి ఓకే చెప్పారు. అయితే, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ‘ఫైర్ ఎగ్జిట్ విధానం’ సరిగ్గా లేదని అభిప్రాయ పడినట్లు తెలిసింది. దాన్ని సరిచేసుకునేందుకు ఆర్ టీసీ యాజమాన్యం బస్ భవన్ చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేందుకు వీలుగా ఇటీవల భవన్ వెనుకవైపు ఉన్న మార్గం నుంచి మెయిన్ గేట్ వరకు మార్గాన్ని నిర్మించిందని సమాచారం. అయితే రిలయన్స్‌తో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలకు కూడా భవనాన్ని అద్దెకు ఇవ్వాలని ఆర్ టిసి భావిస్తోంది. ఇందుకోసం బస్ భవన్‌లోని ‘ఎ’ బ్లాక్ లో ఉన్న చైర్మన్ ఛాంబర్ ను ‘బి’ బ్లాక్ లోకి, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఎస్ ఆర్ బిఎస్ - పిఎఫ్ - పెన్షన్ - ఆపరేషన్స్ తదితర విభాగాలను ఎంజి బస్ స్టేషన్‌కు, అధికారుల కార్యాలయాలను సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ భవన్ కు తరలించాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మీడియా ప్రచారంపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. ప్రధాన కార్యాలయంలో అద్దెకు ఇవ్వాలనేది ఆలోచన మాత్రమేనని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్‌టిసి అధికార వర్గాలు వెల్లడించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/