ఇప్పటికే చాలామంది క్రికెటర్లు తమ అభిరుచికి తగ్గట్లు రెస్టారెంట్లు ప్రారంభించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ - టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ - పేస్ బౌలర్ జహీర్ ఖాన్ - భారత డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ - ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు రెస్టారెంట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా, ముంబైలో 'ధోని-కోహ్లీ' పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ధోనీ - కోహ్లీలు ఇద్దరూ కలిసి ఒకే రెస్టారెంట్ ఏర్పాటు చేయడం ఏమిటి? ఎంచక్కా ఎవరి రెస్టారెంట్ వారు ఓపెన్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా? విషయమేమిటంటే ఈ రెస్టారెంట్ మాత్రమే వారి పేరు మీద ఉంది, దాని ఓనర్లు వేరే ఉన్నారు. ధోనీ - కోహ్లీల మీద అభిమానంతో ఓ వ్యాపారి తన రెస్టారెంట్ కు వారి పేర్లు పెట్టుకున్నాడు. ఈ మాజీ-తాజా సారథుల పేర్ల మీద వెలిసిన రెస్టారెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తమ పేర్ల మీద ఉన్ ఈ రెస్టారెంట్ ను ధోనీ - కోహ్లీలు ప్రారంభించకపోవడం విశేషం. కేవలం వారికి ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు ఆ ఇద్దరి పేర్లను ఆ వ్యాపారి పెట్టుకున్నాడు. ముంబైలోని కాండీవలి ఈస్ట్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఉంది. తమ అభిమాన క్రికెటర్ల పేర్లపై ఆ రెస్టారెంట్ ఉండడంతో చాలామంది అక్కడికి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో, ఆ రెస్టారెంట్ బిజీబిజీగా మారింది. ఈ రెస్టారెంట్ కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు మోహన్ దాష్ మేనన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో, ఆ రెస్టారెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి మిగతా క్రికెటర్ల లాగానే భవిష్యత్తులో ధోనీ - కోహ్లీలు కూడా రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారేమో వేచి చూడాలి.